మహిళలపై అఘాయిత్యాలు ఆగడంలేదు. దేశంలో ఎక్కడో ఒక చోట లైంగికదాడులు జరుగుతూనే ఉన్నాయి. కామాంధుల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ప్రభుత్వాలు ఎన్ని పటిష్ట చర్యలు తీసుకుంటున్నా ఇలాంటి ఘటనలు తరచూ చోటుచేసుకుంటుండడం ఆందోళన కలిగిస్తోంది.
తాజాగా కేరళ(Kerala)లో ఓ వ్యక్తి 52 ఏళ్ల మహిళపై లైంగికదాడికి పాల్పడ్డాడు. దీంతో ఆమె తీవ్ర గాయాలపాలైంది. వివరాల్లోకి వెళ్తే.. ఆస్సాం(Assam) కి చెందిన 32ఏళ్ల వ్యక్తి ఫిర్దౌస్ కేరళలో పనిచేస్తున్నాడు. కొచ్చిలోని రైల్వేస్టేషన్లో పనిచేస్తున్న రైల్వే కూలీగా పనిచేస్తున్న మహిళను, మెట్రోస్టేషన్‌కు దారి చూపిస్తానని ప్రలోభపెట్టాడు.
రైల్వే ఓవర్ బ్రిడ్జ్ సమీపంలో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి లైంగికదాడికి ఒడిగట్టాడు. ఈ ఘటన తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్రగాయాలతో ఉన్న బాధితురాలిని స్థానికులు గమనించి ఆసుపత్రికి తరలించారని పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో నిందితుడికి సంబంధించిన వివరాలను పోలీసులు బాధితురాలి నుంచి సేకరించారు.
నిందితుడి ఆచూకీని ఎట్టకేలకు గుర్తించారు. ఈ ఘటన అనంతరం నిందితుడు కొచ్చిలో ఉన్నట్లు వెల్లడించారు. నిందితుడి సొంతరాష్ట్రం అస్సాం అయినా మళయాళంలో అణర్గళంగా మాట్లాడినట్లు తెలిపారు. ఈ మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.