జనసేన (Janasena) పార్టీ (Party) అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కు ఆ పార్టీ నేతలు వరుస షాకులు ఇస్తున్నారు. 2023 ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్న జనసేన పార్టీ నుంచి ఒక్కొక్కరుగా జంప్ అవుతున్నారు. గతంలో పార్టీలో కీలకంగా ఉన్న నేతలు జేడీ లక్ష్మీనారాయణ (JD Lakshminarayana), రావెల కిషోర్ బాబు, ఆకుల సత్యనారాయణ, చింతలపూడి వెంకట్రామయ్య, పార్ధసారధి, మాజీ మంత్రి బాలరాజు, పిఠాపురం మాజీ ఇంచార్జ్ మాకినీడి శేషు కుమారి (Seshu Kumari) పార్టీ కి గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే.
ఇప్పుడు మరో నేత జనసేనను వీడుతున్న వార్త పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తికర చర్చకు తెర తీసింది. తాజాగా నెల్లూరు నేత, కేతంరెడ్డి వినోద్ రెడ్డి (Ketamreddy Vinod Reddy) రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.. రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరనున్నట్టు వెల్లడించారు.. శేషు కుమారి పార్టీ కి గుడ్ బై చెప్పి 24 గంటలు గడవక ముందే కేతంరెడ్డి రాజీనామా చేయడం జనసేనను షాక్ గురిచేస్తుంది.
తెలుగుదేశం పార్టీతో పొత్తు ప్రకటించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. నాలుగో విడత వారాహి విజయ యాత్రను కృష్ణా జిల్లాలో విజయవంతం చేశారు. కాగా, జనసేన, తెలుగుదేశం పార్టీల మధ్య పొత్తు కుదరడంతో ఇరు పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా నెల్లూరు నగరం నుంచి పోటీ చేసే అవకాశం లేకపోవడంతోనే కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.. నెల్లూరు సిటీ టీడీపీ ఇంఛార్జిగా మాజీ మంత్రి నారాయణ ఉన్నారు.. మరో వైపు మూడు నెలల క్రితం పార్టీ ఇంచార్జ్ పదవి నుంచి శేషుకుమారి తొలగించడంతో మనస్థాపం చెందిన ఆమె జనసేనకు రాజీనామా చేసారు.
ఏది ఏమైనా రాజకీయాల్లో సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా జనసేన పార్టీ వీడి వెళ్లిపోతుంటే జనసేన భవిష్యత్ ఏంటి అన్న ప్రశ్న జనసైనికుల్లో ఉత్పన్నం అవుతుంది. మొత్తానికి జనసేన పార్టీ నుండి నేతలు వెళ్ళిపోవటం పార్టీకి మైనస్ గా అవుతున్న పవన్ మాత్రం వారిని ఆపలేకపోతున్నారనే టాక్ వినిపిస్తోంది..