Telugu News » Chandrbabu : అంగళ్లు అల్లర్ల కేసులో ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం..!!

Chandrbabu : అంగళ్లు అల్లర్ల కేసులో ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం..!!

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, అంగళ్లు అల్లర్ల కేసులో ముందస్తు బెయిల్‌ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, లక్ష రూపాయల పూచీకత్తు, ఇద్దరు ష్యూరిటీలు ఇవ్వాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది.

by Venu

ఏపీ (AP) స్కిల్‌ డెవలప్‌మెంట్‌ (Skill development) కేసులో చంద్రబాబు (Chandrbabu) అరెస్ట్ విషయం గత కొన్ని రోజులుగా ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. బాబు అరెస్ట్ తర్వాత ఆయనకు బెయిల్ రావడం ఎంతో కష్టతరంగా మారింది అని అందరూ అనుకొన్నారు కూడా.. ఇదే సమయంలో రాజమండ్రి సెంట్రల్‌ జైలులో రిమాండ్‌లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు కాస్త ఊరట లభించింది.

 

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, అంగళ్లు అల్లర్ల కేసులో ముందస్తు బెయిల్‌ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, లక్ష రూపాయల పూచీకత్తు, ఇద్దరు ష్యూరిటీలు ఇవ్వాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా గతంలో ఏపీ హైకోర్టు ఇదే కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేసిన విషయం విదితమే..

కాగా, అంగళ్లు అల్లర్ల కేసులో చంద్రబాబు ఏ1గా ఉన్నారు. హత్యాయత్నంతో పాటు ఇతర సెక్షన్ల కింది కేసులు కూడా నమోదు చేశారు పోలీసులు. ఇలా మొత్తం 179 మంది నేతలపై కేసులు నమోదు అవగా.. టీడీపీ నేతలు హైకోర్టుకు వెళ్లారు.. విచారణ క్రమంలో కొంతమందికి బెయిల్‌ వచ్చింది.. ఇప్పుడు చంద్రబాబుకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు..

You may also like

Leave a Comment