జై శ్రీరాం అనే నినాదం రాజకీయాలకే కానీ..భక్తి భావానికి కాదని అమిత్ షా (amith shah) విషయంలో మరోసారి నిరూపించినట్లయ్యింది. ఆదివారం ఖమ్మం (khammam) లో భారీ బహిరంగ సభ సందర్భంగా అమిత్ షా వస్తున్నారు. ఈ క్రమంలో ఆయన భద్రాచలం రాముల వారిని దర్శించుకుంటారని పార్టీ వర్గాలు అంచనా వేశాయి.
కానీ ఆయన భద్రాచలం (bhadrachalam) పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలుస్తుంది. దీంతో అక్కడి ప్రజలు రాముడి పై ఉన్న భక్తి ఇదేనా అంటూ ప్రశ్నిస్తున్నారు. అమిత్ షా ఆదివారం నాడు ముందుగా ఢిల్లీ నుంచి హెలికాఫ్టర్ లో బయల్దేరి ఏపీలోని గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు.
అక్కడ నుంచి బయల్దేరి భద్రాచలం వెళ్లి అక్కడ రాముల వారిని దర్శనం చేసుకునేలా షెడ్యూల్ ఖరారైంది. కానీ భద్రాచలం పర్యటన రద్దయినట్లు శనివారం సాయంత్రం బీజేపీ (bjp) యంత్రాంగం ప్రకటించింది. కేవలం ఖమ్మంలో జరిగే బహిరంగ సభకు మాత్రమే హాజరవుతున్నట్లు తెలిపారు.
భద్రాచలం పర్యటన రద్దు కావడంతో బీజేపీ నేతలు కూడా నిరాశకు గురయ్యారు. ఇప్పటికే రెండు సార్లు అమిత్ షా ఖమ్మం పర్యటన వాయిదా పడింది. ఇప్టపికీ దానికి ముహుర్తం కుదిరినప్పటికీ భద్రాచలం పర్యటన రద్దు కావడంతో ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి.