Telugu News » warangal mla camp office: వరంగల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత!

warangal mla camp office: వరంగల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత!

బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షురాలు పద్మ(leader padma)ను పోలీసులు ముందుగానే హౌస్‌ అరెస్ట్ (house arrest) చేశారు. అయినప్పటికీ పద్మ బయటకు రావడంతో ఆమెను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు.

by Sai
clashes between bjp and brs leadersat warangal mla vinay bhaskar camp office

వరంగల్ జిల్లాలో బీఆర్‌ఎస్‌(brs) , బీజేపీ(bjp) కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటన బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌ (mla vinay bhaskar) క్యాంప్‌ కార్యాలయం వద్ద చోటు చేసుకుంది. ఇరు వర్గాలు కర్రలు, రాళ్లతో ఇరు వర్గాల మధ్య దాడి చేసుకున్నాయి.

clashes between bjp and brs leadersat warangal mla vinay bhaskar camp office

ఈ దాడిలో ఇరు వర్గాల వారికి తీవ్ర గాయాలు అయ్యాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాల వారిని చెదరగొట్టారు. గాయాలపాలైన వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో పోలీసులు లాఠీఛార్జీ చేయాల్సి వచ్చింది. గురువారం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించాలని బీజేపీ పిలుపునిచ్చింది.

ఈ క్రమంలోనే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్దకు బీజేపీ కార్యకర్తలు, నేతలు భారీగా తరలి వచ్చారు. క్యాంప్‌ కార్యాలయాన్ని ముట్టడించేందుకు బీజేపీ శ్రేణులు ప్రయత్నించాయి. దీంతో అక్కడే ఉన్న బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, నేతలు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించాయి.

ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఇది కాస్తా కర్రలు, రాళ్లతో దాడి చేసుకునే వరకు వెళ్లింది. కేసీఆర్‌ ప్రభుత్వం గద్దెనెక్కి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని బీజేపీ ఆరోపించింది.

ఈ క్రమంలోనే బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడికి బీజేపీ పిలుపునిచ్చింది. దీంతో బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షురాలు పద్మ(leader padma)ను పోలీసులు ముందుగానే హౌస్‌ అరెస్ట్ (house arrest) చేశారు. అయినప్పటికీ పద్మ బయటకు రావడంతో ఆమెను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు.

మరో వైపు బీజేపీ శ్రేణులు వినయ్‌ భాస్కర్ ఇంటి ముందు ఆందోళన కార్యక్రమం చేపట్టే అవకాశం ఉండడంతో పోలీసులు ముందస్తు చర్యగా ముళ్ల కంచెను ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడికి బీజేపీ శ్రేణులు ప్రయత్నించాయి. దీంతో వారిని బీఆర్‌ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి.

ఈ క్రమంలోనే పోలీసులు ఇరు వర్గాల పైన కూడా లాఠీ ఛార్జీ చేశారు. ఈ ఘటనలో ఒకరికి తలకు తీవ్రంగా గాయాలయ్యాయి. అతడిని ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ గొడవలో మొత్తంగా ఐదుగురికి గాయాలు అయ్యాయి.అదుపులోకి తీసుకున్న రెండు పార్టీల శ్రేణులను పోలీసులు పోలీస్ స్టేషన్లకు తరలించారు.

కేటీఆర్‌ క్యాంప్‌ ఆఫీస్‌ ముట్టడి..బీజేపీ నాయకుల అరెస్ట్‌!

తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తున్నారని ప్రతి జిల్లాలోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులను ముట్టడించాలని బీజేపీ పిలుపునిచ్చింది.

ఈ క్రమంలోనే పలు జిల్లాల్లో బీజేపీ శ్రేణులు క్యాంపు ఆఫీసులను ముట్టడించడానికి యత్నించగా ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో సిరిసిల్ల లోని కేటీఆర్‌ క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించడానికి బీజేపీ నేతలు ప్రయత్నించారు.

దీంతో ముట్టడికి యత్నించిన బీజేపీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు బీజేపీ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

దీంతో బీజేపీ శ్రేణులు రోడ్డు మీద కూర్చుని నిరసన తెలిపారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి పీఎస్‌ కు తరలించారు.ఈ సందర్భంగా బీజేపీ నేతలు మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాలన కేవలం వంద రోజులు మాత్రమే మిగిలి ఉందని, ఎస్సీలకు దళిత బంధు, బీసీలకు బీసీ బంధు ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.

సిరిసిల్ల పట్టణం వర్షాలకు నీట మునిగిన కూడా కేటీఆర్‌ కన్నెత్తి కూడా చూడలేదని వారు ఆరోపించారు. పేదలకు డబులు బెడ్‌ రూం ఇళ్లు ఇవ్వలేదని విమర్శించారు.

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటిని వెంటనే అమలు చేయాలని, లేకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ధర్నాలు రాస్తారోకోలు చేపడతామని బీజేపీ నాయకులు హెచ్చరించారు.

You may also like

Leave a Comment