చైనాకు తల పెట్టిన వన్ బెల్ట్-వన్ రోడ్ ఇనిషియేటివ్ కు ధీటుగా జీ-20 దేశాలు కొత్తగా ఓ ప్రాజెక్టును తీసుకు వచ్చాయి. భారత్ – తూర్పు మధ్య దేశాలు-యూరప్ (IMEC)దేశాలను కనెక్ట్ చేసే ఎకనామిక్ కారిడాపర్ పై జీ-20లోని కొన్ని దేశాలు ఓ అవగాహనకు వచ్చాయి. ఈ మేరకు కారిడార్ కు సంబంధించిన అవగాహనా పత్రాలపై భారత్, అమెరికా, యూఏఈ, సౌదీ అరేబియా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, యూరోపియన్ యూనియన్ లు సంతకాలు చేశాయి.
ఆసియా-యూరప్- అరేబియన్ గల్ఫ్ దేశాల మధ్య కనెక్టివిటీని మరింత మెరుగు పరుస్తూ ఆర్థిక సమైక్యతను పెంపొందించి ఆర్థిక అభివృద్ధిని సాధించేందుకు ఈ ప్రాజెక్టును తీసుకు వస్తున్నట్టు వెల్లడించాయి. ఈ ప్రాజెక్టు మొత్తం ప్రపంచాన్ని అనుసంధానం చేస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ప్రపంచాన్ని ఇది సుస్థిరా భివృద్ధి వైపు నడిపిస్తుందని తెలిపారు.
ఇది ఒక అతి పెద్ద చారిత్రాత్మకమైన ఒప్పందం అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చెప్పారు. ఐఎంఈసీ ప్రాజెక్టు కోసం ఎతం బడ్జెట్ కేటాయించాలనే విషయంపై దేశాలు ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇందులో రెండు ప్రత్యేకమైన కారిడార్లు ఉంటాయని తెలుస్తోంది. ఇందులో తూర్పు కారిడార్ భారత్- అరేబియన్ గల్ఫ్ ప్రాంతాలను కలుపనున్నట్టు సమాచారం.
ఇక ఇందులోని ఉత్తర కారిడార్ అరేబియన్ గల్ఫ్-యూరప్ ప్రాంతాలను కలుపుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. భారత్ లోని ముంద్రా నౌకశ్రయాన్ని పుజైరా నౌకాశ్రయాలను ఈస్ట్ కారిడార్ అనుసంధానం చేస్తుంది. అదే విధంగా సౌదీ అరేబియా, జోర్డాన్ దేశాల గుండా రైలు మార్గాన్ని వినియోగించుకుని స్టాండర్డ్ టైజ్ కంటెయినర్ల ద్వారా ఇజ్రాయెల్ పోర్టు హైఫాకు సరుకును రవాణా చేయవచ్చు. ఇక వెస్ట్ కారిడార్ హైఫా నుంచి ప్రారంభమవుతుంద. అక్కడి నుంచి భారత్ లోని సరుకులను వివిధ నౌకాశ్రయాలకు రవాణా చేయవచ్చు.