Telugu News » Khairatabad : ఛలో ఖైరతాబాద్ గణేష్…వీకెండ్ జోష్…

Khairatabad : ఛలో ఖైరతాబాద్ గణేష్…వీకెండ్ జోష్…

ఖైరతాబాద్ వినాయకుడి దర్శనానికి క్యూలైన్లలో పెద్ద సంఖ్యలో భక్తులు వేచి ఉన్నారు. ఈరోజు సెలవు కావడం... భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో ఖైరతాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.

by Prasanna
devotees

ఆదివారం… ఆఫీసులకూ, సూళ్లకూ సెలవు కావడంతో ఖైరతాబాద్ మహాగణపతిని (Khairatabad Ganesh) దర్శించుకునేందుకు భక్తులు (Devotees) బారులుతీరారు. ఖైరతాబాద్  లో కొలువైన  శ్రీ దశవిద్య మహాగణపతిని (Sri Dasavidya Maha Ganapathi) కళ్లారా చూసేందుకు నగరం నలుమూలల నుంచే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచీ భక్తులు పెద్ద సంఖ్యలో రావడంతో ఆ పరిసర ప్రాంతం అంతా సందడి వాతావరణం నెలకొంది.

devotees

ఖైరతాబాద్ వినాయకుడి దర్శనానికి క్యూలైన్లలో పెద్ద సంఖ్యలో భక్తులు వేచి ఉన్నారు. ఈరోజు సెలవు కావడం… భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో ఖైరతాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో వాహనదారులు నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్ ప్రాంతాలు ట్రాఫిక్ దిగ్బంధంలో ఉన్నాయి. ఖైరతాబాద్ పరిసర ప్రాంతాలు గణేష్ మహరాజ్ కీ జై నినాదాలతో మార్మోగింది. ఇవాళ ఉదయం ఆరు గంటల నుంచే భారీ క్యూలైన్లు కన్పించాయి. సాయంత్రమయ్యే కొద్ది ఆ లైన్లు పెరుగుతూనే ఉన్నాయి.

ఖైరతాబాద్ గణనాధుడి వద్దకు తండోపతండాలుగా తరలివస్తున్న భక్తులను కంట్రోల్ చేసేందుకు పోలీసులు నానా ఇబ్బందులు పడుతున్నారు. మింట్ కాంపౌండ్, ఖైరతాబాద్ చౌరస్తా, లక్షీకాపూల్, టెలిఫోన్ భవన్ రోడ్లపై ట్రాఫిక్ జామ్ వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక ఈ ప్రాంతానికి వచ్చే సిటీ బస్సులు, మెట్రో రైళ్లు సైతం జనంతో కిటకిటలాడాయి.

నిమర్జనానికి ముందు ఇదే చివరి హాలీడే కావడంతో భక్తులు ఛలో ఖైరతాబాద్ అంటూ అందరూ ఇవాళ గణేషుడి వద్దకే బయలుదేరారు. హాలీడే ఎఫెక్ట్ తో ఖైరతాబాద్ గణనాధుడు వద్ద భక్త జన సముద్రం కనిపిస్తోంది.

 

 

You may also like

Leave a Comment