ఖమ్మం (Khammam) జిల్లాలోని మంత్రి తుమ్మల క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి.. తుక్కుగూడా సభకు ఖమ్మం నుంచి భారీగా కాంగ్రెస్ కార్యకర్తలు తరలిరావాలని పిలుపునిచ్చారు.. అవినీతి, అసమర్థ, భూకబ్జాలు, అధికార బలంతో అధికారంలోకి రావాలని చూసిన బిఆర్ఎస్ ను ఎదుర్కొని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినట్లు తెలిపారు.
గత ప్రభుత్వ హయాంలో ఏ డిపార్ట్మెంట్ చూసిన అవినీతిలో కూరుకు పోయిందని ఆరోపించిన మంత్రి.. గత ప్రభుత్వం విచ్చలవిడిగా చేసిన అప్పులను తట్టుకుంటు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.. అలాగే ఏన్నికల ముందు పక్క రాష్ట్రం అక్రమంగా ప్రాజెక్టుల నుంచి నీరు తీసుకు పోయిన గత ప్రభుత్వం చూసిచూడనట్లు వదిలేసారని తుమ్మల ఆరోపించారు..
ప్రస్తుతం రాష్ట్రంలో కరువు కారణంగా ప్రాజెక్టుల్లో నీరు అడుగంటింది.. ప్రాజెక్టుల గేట్లు ఎత్తిన నీరు రాదు. అయిన నీటి ఎద్దడిని తట్టుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందిని తెలిపిన మంత్రి.. బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వంలో మొదటి పంటకు కూడా నీళ్లు ఇవ్వలేదన్నారు.. భూగర్భ జలాలను వాడుకుని రైతులు పంటలు పండించారని పేర్కొన్నారు.. కానీ ప్రస్తుతం బీఆర్ఎస్ నేతలు ఈ విషయాన్ని మరచి రైతుల దగ్గరికి వెళ్లి రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు..
పంటనష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లిస్తామన్న మంత్రి తుమ్మల నాగేశ్వర రావు (Tummala Nageswara Rao).. రైతులకు ఇచ్చిన మాటను కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం నిలపెట్టికుంటుందని వెల్లడించారు. రాష్ట్రంలో కొన్ని చోట్ల మంచినీటి సమస్య ఉన్నమాట వాస్తవం అని తెలిపిన ఆయన.. ఖమ్మం ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు..