తెలంగాణ (Telangana) అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Election)ఎన్నో కీలక ఘట్టాలు ఎదురవుతున్నాయని కాంగ్రెస్ (Congress) ప్రచార కమిటీ కో-కన్వీనర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) అన్నారు. రాష్ట్రాన్ని దోచుకోవడానికి తయారైన దొంగల బండి ఇంకా దోచుకోన్నది సరిపోక నీతి కథలు చెబుతూ.. ఉన్న రాష్ట్ర సంపదను ఊడ్చడానికి సిద్దపడుతుందని పొంగులేటి విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఖమ్మం, సంజీవరెడ్డి భవన్లో మీడియాతో మాట్లాడిన పొంగులేటి సీఎం కేసీఆర్ (CM KCR)పై విమర్శలు గుప్పించారు.
తెలంగాణలో ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతూ, జైలుకు పంపుతున్న కేసీఆర్ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా ఉందని పొంగులేటి అన్నారు.. డబ్బు, అహంకారం, అధికార మదంతో విర్రవీగే కేసీఆర్.. మీరా ప్రజా స్వామ్యం గురించి మాట్లాడేదని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతిక అర్హత కల్వకుంట్ల కుటుంబానికి లేదన్నారు శ్రీనివాస్ రెడ్డి.
నాపై చేస్తున్న ఆరోపణలు నిజమని నిరూపిస్తే ఎక్కడికి రావడానికైనా సిద్దం అంటూ పొంగులేటి సవాల్ విసిరారు.. నాకు ఏ పైరవీలు చేశారు… ఏ కాంట్రాక్టులు ఇచ్చారో చెప్పండని శ్రీనివాస్ రెడ్డి దబాయించారు. ఈ విషయంలో కేసీఆర్కు ఛాలెంజ్ చేస్తున్న.. గుడిలో తడి బట్టలతో ప్రమాణం చేయడానికి నేను సిద్దం.. మీరు సిద్దామా? అంటూ ప్రశ్నించారు. ఏ గుడికి వస్తారో రండి…. నేను కూడా అదే గుడికి వస్తా అని పొంగులేటి సవాల్ విసిరారు.
సోల్లు కబుర్లు చెబుతూ జనాన్ని మోసం చేయడం మీకు వెన్నతో పెట్టిన విద్య అని దొరల పాలనపై పొంగులేటి సెటైర్లు వేశారు. ధనిక రాష్ట్రం అయిన తెలంగాణను దోచుకుని దాచుకున్నారని ఆరోపించారు. అధికారం కోసం హద్దులు దాటి నీచమైన రాజకీయాలు చేస్తున్న నాయకుడిని ఎక్కడ చూడలేదని పొంగులేటి విమర్శించారు.. ఈ క్రమంలో ఒక్క బీఆర్ఎస్ అభ్యర్థిని కూడా ఉమ్మడి ఖమ్మంలో గెలవనిచ్చేది లేదని పొంగులేటి సవాల్ చేశారు.