ఖమ్మం (Khammam) జిల్లా రాజకీయం రోజుకో కొత్త వేషం వేస్తుందని జనం అనుకుంటున్నారు.. ఇక్కడి నేతల మధ్య మాటలు నువ్వెంత అంటే నువ్వెంత అనే వరకు వెళ్లడంతో ఇక్కడి రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇప్పటి వరకు విమర్శల దగ్గరే ఆగిన ఈ నియోజక వర్గ నేతలు ఫిర్యాదుల వరకు వెళ్లారు. తాజాగా ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి పువ్వాడ అజయ్ (Puvvada Ajay) దాఖలు చేసిన నామినేషన్ చెల్లదని ఆరోపించారు కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వర్ రావు (Tummala Nageshwar Rao)
పువ్వాడ అజయ్ నామినేషన్ పై రిటర్నింగ్ ఆఫీసర్ కు ఫిర్యాదు చేశారు. ఈ అఫిడవిట్ సరైన ఫార్మెట్లో లేదని తుమ్మల పేర్కొన్నారు. నిబంధనలకు అనుగుణంగా లేని నామినేషన్ ని తిరస్కరించాలని తుమ్మల కోరారు. మరోవైపు పువ్వాడ నామినేషన్ పత్రాలు సరిగానే ఉన్నాయని.. రిటర్నింగ్ అధికారి తుమ్మలకు తెలిపినట్టు సమాచారం..
మరోవైపు ఎన్నికల నిబంధనలు పువ్వాడ పాటించలేదని.. ఆర్ఓపై ఎన్నికల సంఘనికి ఫిర్యాదు చేస్తానని.. అవసరమైతే న్యాయస్థానంలో కూడా పోరాటం చేస్తానని తుమ్మల స్పష్టం చేసినట్టు స్థానికంగా విపిస్తున్న టాక్.. మరోవైపు తుమ్మల నాగేశ్వరరావు చేసిన ఫిర్యాదుపై పువ్వాడ అజయ్ కుమార్ స్పందించారు.
తన నామినేషన్ తిరస్కరించాలని తుమ్మల చెప్పినట్టు చేస్తే ముందుగా టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి కొడంగల్లో వేసిన నామినేషన్ రద్దు చేయాలని వెల్లడించారు.. తుమ్మలకు అధర్మ పోరాటం అలవాటని పువ్వాడ విమర్శించారు.