Telugu News » Kottagudem Kidnap : భర్తను కొట్టి భార్యను ఎత్తుకెళ్లారు….!

Kottagudem Kidnap : భర్తను కొట్టి భార్యను ఎత్తుకెళ్లారు….!

భర్తపై దాడిచేసి భార్యను ఎత్తుకెళ్లారు దుండగులు.

by sai krishna

భర్తపై దాడిచేసి భార్యను ఎత్తుకెళ్లారు దుండగులు. స్థానికంగా కలకలం రేపిన ఈ కిడ్నాప్..ఖమ్మం జిల్లా(Khammam) భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri Kothagudem)లోజరిగింది. ఈ కిడ్నాప్(Kdnap) పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

వివరాల్లోకి వెళ్తే..ఖమ్మం నగరానికి చెందిన దూలగొండ సన్నీ, కొత్తగూడెం నగరానికి చెందిన గొగ్గెల మాధవి ఇటీవలే ప్రేమవివాహం చేసుకున్నారు.ఇటీవల సన్నీ తన భార్య మాధవిని ప్రాజెక్టు వర్కు నిమిత్తం ఖమ్మం నుంచి కొత్తగూడెం కళాశాల(Kothagudem College)కు ఆటోలో తీసుకెళుతున్నాడు.


మార్గమధ్యంలో కారుతో ఆటోను ఛేజ్ చేసిన దుండగులు..ఆటోను నిలిపివేశారు. ఆపై యువకుడిపై దాడి చేసి యువతిని బలవంతంగా కార్లో ఎత్తుకెళ్లారు. కులాంతర ప్రేమవివాహం కారణంగానే తనపై దాడి చేసి తన భార్యను కిడ్నాప్ చేశారని బాధిత యువకుడు ఆరోపించారు.

తనకూ, తన భార్యకు ప్రాణహాని ఉందంటూ బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు యువతి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కిడ్నాప్‌ అయిన ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజ్‌లను పోలీసులు పరిశీలిస్తున్నారు.

You may also like

Leave a Comment