Telugu News » KIMS Hospital: కిమ్స్‌ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం.. గోప్యంగా ఉంచిన ఆసుపత్రి వర్గాలు..!

KIMS Hospital: కిమ్స్‌ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం.. గోప్యంగా ఉంచిన ఆసుపత్రి వర్గాలు..!

సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ ఆసుపత్రి(KIMS Hospital)లో అగ్ని ప్రమాదం(Fire accident) చోటుచేసుకుంది. ప్రమాదం నిన్న (బుధవారం) జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనను ఆసుపత్రి యంత్రాంగం గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది.

by Mano
KIMS Hospital: Fire accident in KIMS Hospital.. hospital sources kept confidential..!

సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ ఆసుపత్రి(KIMS Hospital)లో అగ్ని ప్రమాదం(Fire accident) చోటుచేసుకుంది. ఆసుపత్రిలోని ఐసీయూ(ICU)లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో రోగులు అవస్థలు పడ్డారు. దట్టమైన పొగ వ్యాపించడంతో ఆసుపత్రి సిబ్బంది ఐసీయూలో ఉన్న రోగులను మరో వార్డుకు తరలించారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

KIMS Hospital: Fire accident in KIMS Hospital.. hospital sources kept confidential..!

సమాచారం అందుకున్న ఆసుపత్రి సిబ్బంది వెంటనే మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అగ్నిప్రమాదంతో ప్రమాదం నిన్న (బుధవారం) జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనను ఆసుపత్రి యంత్రాంగం గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది. పెను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ అగ్ని ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి.

అదేవిధంగా, సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. విపరీతంగా మంటలు వ్యాపించడంతో పాటు అందులో ఉండే రసాయనాల కారణంగా చుట్టుపక్కల ప్రాంతాలన్నీ దట్టమైన పొగలు వ్యాపించాయి. కెమికల్ డ్రమ్ములు పేలడంతో మంటలను అదుపు చేసేందుకు కార్మికులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.

పాశమైలారం ఇండస్ట్రియల్ ఏరియాలోని ఎంఎస్ఎన్ రెండో యూనిట్‌లో రాత్రి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రసాయన డ్రమ్ములు, ఎంఎస్ఎన్‌ ఇండస్ట్రీస్ నిల్వ విభాగంలో నిల్వ ఉండటంతో భారీ పేలుడు కలకలం రేపింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.

You may also like

Leave a Comment