Telugu News » Kishan Reddy: ప్రాంతీయ భాషకు ప్రధాన్యత ఇవ్వాలి: కిషన్‌రెడ్డి

Kishan Reddy: ప్రాంతీయ భాషకు ప్రధాన్యత ఇవ్వాలి: కిషన్‌రెడ్డి

ప్రతీ ఒక్కరు తమ ప్రాంతీయ భాషకు ప్రధాన్యత ఇవ్వాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి(Kishan Reddy) అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు మాతృభాషను విధిగా నేర్పించి మాతృభాషను రక్షించుకోవాలన్నారు.

by Mano
Kishan Reddy: Priority should be given to regional language: Kishan Reddy

ప్రతీ ఒక్కరు తమ ప్రాంతీయ భాషకు ప్రధాన్యత ఇవ్వాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి(Kishan Reddy) అన్నారు. వసంత పంచమి (Vasantha Panchami) పర్వదినాన్ని పురస్కరించుకొని ఇవాళ(బుధవారం) అంబర్‌పేట్‌లోని మహంకాళి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు.

Kishan Reddy: Priority should be given to regional language: Kishan Reddy

అనంతరం కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇంగ్లీష్‌ఫై పట్టు సాధించాలే కానీ మాతృభాషను చంపుకోవద్దని సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు మాతృభాషను విధిగా నేర్పించి మాతృభాషను రక్షించుకోవాలన్నారు. దేశంలో ఇంకా కొన్ని చోట్ల నిరక్షరాస్యత ఉందన్నారు. సామాజిక సంస్థలు ముందుకొచ్చి అక్షరాస్యతను పెంచాలని పిలుపునిచ్చారు. .

ఇదే సమయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక నూతన విద్యా విధానాన్ని  ప్రవేశపెట్టిందని అందులో ప్రాంతీయ భాషలకు కూడా ప్రాధాన్యాన్ని కల్పించిందని తెలిపారు. ఎవరైనా తమకు నచ్చిన మాతృ భాషలో చదువుకోవచ్చని, అదేవిధంగా పరీక్షలనూ రాయొచ్చని స్పష్టం చేశారు.

కాగా, రాష్ట్రవ్యాప్తంగా వసంత పంచమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నిర్మల్ జిల్లా బాసరలోని జ్ఞాన సరస్వతి ఆలయంలో వసంత పంచమి వేడుకలు ప్రారంభమయ్యాయి. అమ్మవారి జన్మదినం సందర్భం 108 కలశాల జలాలతో అభిషేకం చేశారు. పద్మశాలి సంఘం తరఫున అందజేసిన చేనేత పట్టువస్త్రాలతో అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

You may also like

Leave a Comment