ఇప్పటికే తెలంగాణ చాలా నష్టపోయిందని, బీఆర్ఎస్ పైన ప్రజలు తిరగ బడుతున్నారని బీజేపీ(BJP) రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy) అన్నారు. ఎన్నికల నేపథ్యంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ యువత బీజేపీ వైపే ఉందని నిశ్శబ్ద విప్లవం రానుందని తెలిపారు.
అందరికీ న్యాయం జరిగే విధంగా బీజేపీ మేనిఫెస్టో ఉందని కిషన్‌రెడ్డి తెలిపారు. అవినీతినీ ఉక్కుపాదంతో అణచి వేస్తామన్నారు. ఇప్పటికే అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ మంచి ఆదరణ లభిస్తోందని చెప్పారు. దేశానికి వ్యతిరేకంగా ఓటు వేయడాన్ని ప్రజలు నిశ్శబ్ద విప్లవంగా చూస్తున్నాని తెలిపారు. గ్రామాల్లోకి ఎమ్మెల్యేలు, ప్రచార రథాలు రాకుండా ప్రజలు అడ్డుకునే పరిస్థితి నెలకొందని ఎద్దేవా చేశారు.
బీజేపీ ఇచ్చిన హామీలు నెరవెరుస్తుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ వల్లే తెలంగాణ నష్టపోయిందని కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఆ పార్టీ ప్రజల రక్తం తాగిందని ఆరోపించారు. కాంగ్రెస్ గ్యారంటీలు, ఫేక్, ఆచరణ సాధ్యం కానివని, ఓట్ల కోసం మాత్రమే ఇచ్చినవే అని విమర్శించారు. ఏది చెప్పెనా అధికారంలోకి రావలనేది వారి ఆలోచన అన్నారు.
స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ ఎన్నో హామీలు ఇచ్చిందని, ఆ పార్టీ ప్రజలకు విషాదాన్ని మిగిల్చిందని కిషన్‌రెడ్డి అన్నారు. ఉద్యమంలో మొదటి దశలో 365 మంది, మూడోదశలో 1200మంది విద్యార్థులు ఆత్మబలిదానాలు చేసుకున్నారని గుర్తుచేశారు. కొన్ని సర్వే సంస్థలు ఫేక్ లీకులు ఇస్తున్నా బీజేపీ అభ్యర్థులకు ఆదరణ తగ్గడం లేదని, ప్రజలు బీజేపీవైపే ఉన్నరని కిషన్‌రెడ్డి తెలిపారు.