చంద్రబాబు (Chandrababu) అరెస్ట్ తర్వాత అధికార పార్టీ నేతలకు, ప్రతిపక్ష పార్టీ నాయకుల మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరుకుందనే వార్తలు తెరపైకి వస్తున్న నేపధ్యంలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), చంద్రబాబుపై వైసీపీ (YCP) నేత కొడాలి నాని (Nani) సంచలన వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు కోటలో ఉన్నా ఒకటే, పేటలో ఉన్నా ఒకటే. పవన్ కళ్యాణ్ ఓ మొరిగే కుక్క అంటూ ఘాటుగా విమర్శించారు. మొరిగే కుక్క ఎన్నటికీ కరవదు…కరిచే కుక్క ఎన్నడూ మొరగదు అన్న విషయాన్ని పవన్ తెలుసుకోవాలన్నారు. పచ్చ బ్యాచ్ అంతా ఒక్కటైనా జగన్మోహన్ రెడ్డిని ఏం చేయలేరంటూ.. ఏదో చేద్దామని అనుకొన్న బాబు ఎక్కడ ఉన్నాడో తెలుసుకొండని హెచ్చరించారు.
దత్తపుత్రుడు కూడా దత్త తండ్రి దారిలోనే నడుస్తున్నాడని కొడాలి నాని వ్యాఖ్యానించారు. ఇక రూపాయి అంటే 100 అని, పావలా అంటే 25 అని అన్న కొడాలి, పవన్ కళ్యాణ్ భాషలో రూపాయి పావలా ప్రభుత్వం అంటే మా పార్టీకి 125 సీట్లు వస్తాయని చెప్పకనే చెబుతున్నాడన్నారు. ఇకపోతే చంద్రబాబు ఓ పెద్ద అవినీతిపరుడు. 2014 వరకు కమిషన్లకు కక్కుర్తి పడే వ్యక్తి. నారా లోకేష్ వచ్చిన తర్వాత బినామీ ఎకౌంట్లతో ప్రభుత్వ నిధులన్నీ దారి మళ్లించాడని విమర్శించారు.
చంద్రబాబు చేసిన అవినీతికి నేడు రాజమండ్రి సెంట్రల్ జైలు నివాసం అయ్యిందన్న కొడాలి, స్కిల్ స్కాం 2017లో బయడపడగా, 2018లోనే FIR నమోదైందని తెలిపారు. ఎప్పడు ఎవరితో ఉంటారో తెలియని పవన్ కళ్యాణ్ NDA కూటమిలో ఉంటే ఏమిటి…? లేకపోతే మాకేంటి…? అంటూ వ్యాఖ్యానించారు.