బాలయ్య(Balayya), చంద్రబాబు(Chandrababu)పై మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే(Gudiwada MLA) కొడాలి నాని(Kodali Nani) కీలక వ్యాఖ్యలు చేశారు. వెయ్యి మంది బాలయ్యలు, వెయ్యి మంది చంద్రబాబులు వచ్చినా జూనియర్ ఎన్టీఆర్ వెంట్రుక కూడా పీకలేరంటూ ఘాటు విమర్శలు చేశారు.
టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు 28వ వర్థంతి సందర్భంగా గుడివాడలోని ఎన్టీఆర్ స్టేడియంలో ఆయన నివాళులర్పించారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఫ్లెక్సీ వివాదంపై సీరియస్గా స్పందించారు. ఎన్టీఆర్ మానసిక వేదనతో చనిపోయారని, ఎన్టీఆర్ పనికి రాడన్న గజ దొంగ చంద్రబాబు అని ఆరోపించారు.
ఆ చంద్రబాబే ఇప్పుడు ఎన్టీఆర్ బూట్లు నాకుతున్నాడని దుయ్యబట్టారు. చంపిన వ్యక్తులే ఎన్టీఆర్ను పొగుడుతూ కీర్తిస్తున్నారని, టీడీపీ నేతలు ఓట్ల కోసం ఎన్టీఆర్ వర్థంతి కార్యక్రమాలు చేపడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు ‘రా.. కదిలి రా’ అంటే రాజమండ్రి సెంట్రల్ జైలు చంద్రబాబుకు ఆహ్వానం పలుకుతుందని ఎద్దేవా చేశారు.
అల్లుడి నారా లోకేష్ కోసం జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను బాలయ్య తొలగిస్తున్నారని ఫైర్ అయ్యారు. గతంలో పెద్ద ఎన్టీఆర్ను దించిన బాలయ్య ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల మీద పడ్డారని ధ్వజమెత్తారు. హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్లో బాలయ్య నివాళులర్పించిన అనంతరం జూనియర్ ఎన్టీఆర్ పేరుతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తీసేయాలని బాలయ్య సూచించించారు. దీంతో ఈ వీడియో వైరల్ అవడంతో పెనుదుమారం రేపుతోంది.