Telugu News » Kodali Nani: ఎంతమంది పీకేలు వచ్చినా ఏం చేయలేరు: కొడాలి నాని

Kodali Nani: ఎంతమంది పీకేలు వచ్చినా ఏం చేయలేరు: కొడాలి నాని

గుడివాడ ఎమ్మెల్యే(Gudiwada MLA) కొడాలి నాని(Kodali Nani) సెటైర్లు విసిరారు. కృష్ణా జిల్లా(Krishna District) గుడివాడ(Gudiwada)లో ఆయన మీడియాతో

by Mano
Kodali Nani: No matter how many PKs come, they can't do anything: Kodali Nani

టీడీపీ అధినేత చంద్రబాబు, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భేటీపై మాజీ మంత్రి(Ex Minister), గుడివాడ ఎమ్మెల్యే(Gudiwada MLA) కొడాలి నాని(Kodali Nani) సెటైర్లు విసిరారు. కృష్ణా జిల్లా(Krishna District) గుడివాడ(Gudiwada)లో ఆయన మీడియాతో మాట్లాడారు.

Kodali Nani: No matter how many PKs come, they can't do anything: Kodali Nani

మరోసారి చంద్రబాబు తన రెండు కళ్ల సిద్ధాంతాన్ని కొనసాగిస్తున్నాడని కొడాలి నాని మండిపడ్డారు. చంద్రబాబు ఎంతమంది పీకేలను పెట్టుకున్నా.. సీఎం వైఎస్ జగన్‌ను ఏం చేయలేరని అన్నారు. చంద్రబాబు అవుట్ డేటెడ్ పొలిటీషియన్ అని విమర్శించారు. ఇప్పుడు ప్రశాంతి కిషోర్‌ను కలిస్తే భూమి బద్దలై పోతుందా..? అంటూ ప్రశ్నించారు. ప్రశాంత్ కిషోర్‌ బుర్రలో గుజ్జంతా అయిపోయిందని ఎద్దేవా చేశారు.

తమ వ్యూహకర్తగా ఉన్నప్పుడు బీహార్ నుంచి వచ్చిన ప్రశాంత్ ఏం చేస్తాడన్న చంద్రబాబు.. ఇప్పుడు ఏం చేయించడానికి భేటీ అయ్యాడో పసుపు తమ్ముళ్లకు చెప్పాలని కొడాలినాని డిమాండ్ చేశారు. ప్రశాంత్ కిషోర్ సూచనలతో బాబాయ్‌ని చంపి, జగన్ కోడి కత్తి డ్రామాలు అడారని ఆరోపించారు. మరి ఇప్పుడు చంద్రబాబు పీక కోయించుకోవడానికి ప్లాన్ వేస్తున్నారా? అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ఇక, ప్రశాంతి కిషోర్‌కు, ఐప్యాక్‌కు సంబంధం లేదని కొడాలినాని స్పష్టం చేశారు. ఇండియా కూటమిలో చేరమని సీఎం మమతా బెనర్జీ పంపితే ప్రశాంత్ కిషోర్ ఏపీకి వచ్చారని చెప్పుకొచ్చారు. పాట్నర్ పీకే (పవన్ కల్యాణ్) బీజేపీతో చర్చలు జరుపుతుంటే. మరో పీకే (ప్రశాంత్ కిషోర్) ఇండియా కూటమి, మమతా బెనర్జీ, కాంగ్రెస్‌తో చర్చలు జరుపుతున్నాడని దుయ్యబట్టారు.

You may also like

Leave a Comment