Telugu News » Kodanda Ram : రాష్ట్రంలో వచ్చినట్టు ఢిల్లీ పాలనలో మార్పు రావాలి….!

Kodanda Ram : రాష్ట్రంలో వచ్చినట్టు ఢిల్లీ పాలనలో మార్పు రావాలి….!

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చుతామన్నట్లు మాట్లాడుతున్నారని విమర్శలు గుప్పించారు. ప్రగతి భవన్ ముందు గేట్లను సీఎం రేవంత్ రెడ్డి బద్దలు కొట్టినప్పుడు సంతోషం కలిగిందని చెప్పారు.

by Ramu
kodandaram interesting comments on congress rule

ప్రజాభిప్రాయాన్ని బీఆర్ఎస్ (BRS)గౌరవించడం లేదని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం (Kodanda Ram) అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చుతామన్నట్లు మాట్లాడుతున్నారని విమర్శలు గుప్పించారు. ప్రగతి భవన్ ముందు గేట్లను సీఎం రేవంత్ రెడ్డి బద్దలు కొట్టినప్పుడు సంతోషం కలిగిందని చెప్పారు.

kodandaram interesting comments on congress rule

రేవంత్ ప్రవర్తన సామాన్య జనాలకు నచ్చుతుందని చెప్పారు. కాంగ్రెస్ నెల రోజుల పాలన బాగుందని అన్నారు. అన్ని అంశాలపై సమీక్షలు చేస్తూ మార్పు కోసం కృషి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో మార్పు వచ్చినట్లు ఢిల్లీ పాలనలో కూడా మార్పు రావాలని తెలిపారు. రాష్ట్రం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులున్నింటినీ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.

వాట్సప్ కాల్స్ ఆపేసి స్వేచ్ఛగా సాధారణ కాల్స్ మాట్లాడుకునే స్థితి వచ్చిందని పేర్కొన్నారు. ప్రాణం పోతున్న సందర్భంలో ఊపిరి పీల్చుకున్నట్లు అనిపిస్తోందని వెల్లడించారు. తమ పార్టీకి కూడా నామినేటెడ్ పోస్టులు కేటాయించాలన్నారు. జీతాలు సమయానికి రావడంతో ప్రభుత్వ ఉద్యోగులు చాలా సంతోషంగా ఉన్నారని చెప్పారు.

భద్రాచలంలో రాముల వారి ఆలయానికి రక్షణ లేదని ఆరోపణలు చేశారు. భద్రాచలం భద్రతను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శలు గుప్పించారు. కాజీపేటలో కోచ్ వ్యాగన్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్ర ,తెలంగాణ ఉద్యోగుల పంపిణీ చేయాలని కోరారు.

You may also like

Leave a Comment