తెలంగాణ ఎన్నికల(Telangana elections) వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్(Brs) ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా ప్రతిపక్షాలు వ్యూహాలకు సన్నద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో తెలంగాణ జన సమితి(TJS) అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరాం భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.
రాహుల్‌తో భేటీ అనంతరం టీజేఎస్ అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరాం సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్‌తో కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆయన ప్రకటించారు. కరీంనగర్ వి పార్కులో రాహుల్‌తో భేటీ అనంతరం మీడియాతో కోదండరాం మాట్లాడారు.
‘బీఆర్ఎస్‌ను గద్దె దించడానికి అనుసరించాల్సిన వ్యూహంపై రాహుల్ గాంధీతో చర్చించినట్లు కోదండరాం తెలిపారు. కాంగ్రెస్‌తో సీట్ల సర్దు బాటుపై మరోసారి సమావేశం అవుతామన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో భేటీ తర్వాత క్లారిటీ వస్తుందన్నారు. తమ లక్ష్యం నియంత్రత్వ కేసీఆర్‌ను ఓడించడమే అని కోదండరాం మరోసారి స్పష్టం చేశారు.
కాగా.. తెలంగాణ ప్రయోజనాల కోసం కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాలని జన సమితి నిర్ణయించింది. పొత్తులో భాగంగా కాంగ్రెస్ బలహీనంగా ఉన్న ముథోల్, ఎల్లారెడ్డి, కోరుట్ల, జహీరాబాద్ స్థానాలను తెలంగాణ జనసమితి ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ నియంతపాలనను దించడానికే టీజేఎస్ ఏర్పడిందని కోదండరాం వెల్లడించారు.