Telugu News » Sensational Sarth : కుల చిచ్చుకు కారణం నాయకులే…!

Sensational Sarth : కుల చిచ్చుకు కారణం నాయకులే…!

చాలా గ్యాప్‌ తర్వాత ఇసక్కి కార్వణ్ణన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న చిత్రం ‘తమిళకుడిమగన్‌ (Tamilkudimagan)’. కోలీవుడ్‌ నటుడు, దర్శకుడు చేరన్‌ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు.

by sai krishna

చాలా గ్యాప్‌ తర్వాత ఇసక్కి కార్వణ్ణన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న చిత్రం ‘తమిళకుడిమగన్‌ (Tamilkudimagan)’. కోలీవుడ్‌ నటుడు, దర్శకుడు చేరన్‌ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా ఆడియో ట్రైలర్‌ ఆవిష్కరణ కార్యక్రమాన్ని సోమవారం ఉదయం స్థానిక వడపళనిలోని కమలా థియేటర్లో నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి నటుడు శరత్‌ కుమార్‌ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ఇస్సక్కీ కార్వానన్‌(Issaki Carvanon) మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రంలో భగ్గుమంటున్న కుల చిచ్చు ఇతివృత్తంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు తెలిపారు.

 

ఇది చిత్రం కాదు పాఠం. పుట్టుకతో అందరూ సమానమే. ఎదిగిన తర్వాతే కుల అసమానతలు ఏర్పడ్డాయి. ఈ సినిమాలో కుల వృత్తుల గురించి ప్రస్తావించామన్నారు. అనంతరం నటుడు శరత్‌ కుమార్‌(Sarath Kumar) మాట్లాడుతూ.. కుల విభేదాలకు కారణం రాజకీయాలేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

మనిషి పుట్టినప్పుడు తన కులమేమిటన్నది తెలియదు. అదేవిధంగా పాఠశాలలో, కాలేజీల్లో అందరూ కలిసి మెలిసి ఆడుకుంటారు. చదువుకుంటారు. రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాతే కుల, మత భేదాలు తలకెక్కుతున్నాయి. కుల వివక్షత రూపుమాపడానికి వేరే రాజకీయం ఉంది.అదే సమానత్వం. దాని కోసం అందరూ పాటు పడాలి. నేనూ రాజకీయ నాయకుడినే.

సమానత్వవం కోసమే నా భవిష్యత్తు కార్యక్రమాలు ఉంటాయి. ‘తమిళకుడిమగన్‌’ నిజాన్ని చెప్పే సినిమా. కులవృత్తి గురించి ఈ సినిమా మాట్లాడుతుంది.కులంపై ఉన్న అభిప్రాయాలను బ్రేక్ చేసే సినిమాగా ‘తమిళకుడిమగన్’ రాబోతోంది. ఈ సినిమా సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను’ అని శరత్‌ కుమార్‌ అన్నారు.

 

లక్ష్మీ క్రియేషన్స్‌ నిర్మాణ సంస్థ నిర్మించిన ఈ మువీలో లాల్‌, ఎస్‌ఎ చంద్రశేఖర్‌, వేల రామమూర్తి, ధృవ, శ్రీ ప్రియాంక, దీపిక్ష, అరుల్‌దాస్‌, రవిమారియా తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్యావ్‌ సీఎస్‌ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.

You may also like

Leave a Comment