సీఎం కేసీఆర్(Cm kcr)పై ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి(komatireddy venkat reddy) సంచలన ఆరోపణలు చేశారు. ఇవాళ ఆయన నివాసంలో నల్గొండ మున్సిపల్ వైస్ చైర్మన్ రమేష్, కౌన్సిలర్లతో భేటీ అయ్యారు. కోమటిరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అనంతరం ఎంపీ(Mp) కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు.
కోమటిరెడ్డి మాట్లాడుతూ.. ‘పేదలకు ఇల్లు లేవు.. ఉద్యోగాలు లేవు కేసీఆర్..’ అంటూ ఫైర్ అయ్యారు. కేసీఆర్ సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్‌కే సీఎం అంటూ సంచలన ఆరోపించారు. నల్గొండను దత్తత తీసుకున్న కేసీఆర్ ఒక్క ఇల్లు కట్టించారా? అని ప్రశ్నించారు. పేదలకు ఇల్లు కంటేందుకు కాంట్రాక్టర్ రాలేదని సాకు చెప్తున్న ప్రభుత్వం సెక్రటేరియట్‌ను 10నెలల్లో ఎలా కట్టించారని ప్రశ్నల వర్షం కురిపించారు.
పదేళ్లు అధికారంలో ఉండి ఏం చేయని సీఎం ఎన్నికలు దగ్గర పడుతుండడంతో సిలిండర్ రూ.400కే ఇస్తానని చెప్పి మరోసారి ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమయ్యాడని విమర్శించారు. కాంగ్రెస్ పథకాలను కేసీఆర్ కాపీ కొట్టాడని మండిపడ్డారు. గ్రూప్-2 ఆభ్యర్థి ప్రవళిక ఆత్మహత్య ఘటన బాధాకరమని, ప్రవళిక అసలు పరీక్షే రాయలేదని అబద్దాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి కేటీఆర్‌పై ఫైర్ అయ్యారు.