భారత నావికా దళం (Indian Navy) తెలంగాణ (Telangana)ను కీలక స్థావరంగా ఎంచుకొంది. దేశంలోనే రెండో VLF కమ్యూనికేషన్ స్టేషన్ ను వికారాబాద్ (Vikarabad) జిల్లాలో నెలకొల్పుతోంది. నౌకలు, జలాంతర్గాములతో సంభాషించేందుకు ఉపయోగించే వీఎల్ఎఫ్ కమ్యూనికేషన్ ట్రాన్స్ మిషన్ స్టేషన్ ను పూడూరు సమీపంలోని దామగూడెం అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేయనుంది.
అయితే ఈ అంశంపై మంత్రి కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు చేశారు.. నేవీ రాడార్ స్టేషన్ ఏర్పాటు వల్ల తెలంగాణకు ఎలాంటి నష్టం లేదని స్పష్టం చేశారు. ఈ పని తమ ప్రభుత్వం పని కాదని తెలిపిన మంత్రి.. గత బీఆర్ఎస్ ప్రభుత్వమే రాడార్ స్టేషన్కు రిజర్వ్ ఫారెస్ట్ భూములను అప్పగించిందని వెల్లడించారు. కేంద్రం, బీఆర్ఎస్ (BRS) హయాంలోనే అన్ని అనుమతులు ఇచ్చిందన్నారు.
తుది దశ జీవో మాత్రమే పెండింగ్ లో ఉందని, కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం వచ్చాక ఫైల్ పై సంతకం పెట్టి జీవో ఇచ్చామని తెలిపారు. దీనివల్ల ప్రజలకు ఎలాంటి నష్టం వాటిల్లదని నిర్థారణకు వచ్చాకే తుది అనుమతులకు పర్మిషన్ ఇచ్చామని వివరించారు. అయితే ఈ అంశాన్ని పట్టుకొని బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలు అవాస్తమని, తమ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి కొండా సురేఖ (Konda Surekha) మండిపడ్డారు..
మరోవైపు ఇండియన్ నేవీ ఏర్పాటు చేయనున్న రాడార్ స్టేషన్ దేశంలోనే రెండో వీఎల్ఎఫ్ కమ్యూనికేషన్ స్టేషన్ ను.. మొట్ట మొదటిది తమిళనాడులోని తిరునెల్వేలిలో ఉన్న ఐఎన్ఎస్ కట్టబొమ్మన్ రాడార్ స్టేషన్.. ఇకపోతే ఈ ప్రాతంలో నేవీ స్టేషన్ తో పాటు స్కూళ్లు, హాస్పిటళ్లు, బ్యాంకులు, మార్కెట్లు ఏర్పడనున్నాయని, ఈ యూనిట్ లో దాదాపు 600 మంది నావికాదళంతో పాటు ఇతరలు. దాదాపు 2500 నుంచి 3000 మంది నివసిస్తారని సమాచారం..