టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) ని కాంగ్రెస్ (Congress) నుంచి బహిష్కరించాలని ఆ పార్టీ బహిష్కృత నేత కొత్త మనోహర్ రెడ్డి (Kotha Manohar Reddy) అన్నారు. రేవంత్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే (Mallikarjuna Kharge), రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి విజ్ఞప్తి చేశారు.
ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తానంటూ రూ. 10 కోట్లు, 5 ఎకరాల భూమిని రేవంత్ రెడ్డి తీసుకున్నాడని ఆయన ఆరోపించారు. మహేశ్వరం ఎమ్మెల్యే టికెట్ కోసం రూ. 10కోట్లను ఇచ్చానని చెప్పుకుంటున్న బడంగ్ పేట మేయర్ చిగిరింత పారిజాత నర్సింహ రెడ్డి పై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయంలో రంగా రెడ్డి జిల్లా అధ్యక్షుడు చల్లా నర్సింహా రెడ్డిపై కూడా చర్యలు తీసుకోవాలన్నారు.
మహేశ్వరం టికెట్ కోసం డబ్బులు తీసుకున్నారంటూ రేవంత్ రెడ్డిపై వచ్చిన ఆరోపణలు నిజం కాకపోతే చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిపై టీపీసీసీ చీఫ్ ప్రమాణం చేయాలని ఆయన సవాల్ విసిరారు. తన వ్యాఖ్యలను ఇటీవల కొందరు వక్రీకరించారన్నారు.
రేవంత్ రెడ్డి ఏ నియోజక వర్గం నుంచి పోటి చేసినా ఆయనకు పోటీగా బరిలోకి దిగేందుకు తాను రెడీగా వున్నాయని ఆయన చెప్పారు. తన వ్యాఖ్యలపై ఎలాంటి వివరణ తీసుకోకుండా సస్పెన్షన్ వేటు వేయడం అన్యాయమని మండిపడ్డారు. నాయకులు, కార్యకర్తల అభిప్రాయం తీసుకొని భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానన్నారు.