తెలంగాణ (Telangana)లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలలో నామినేషన్ పక్రియ వేగవంతం అయ్యింది. నామినేషన్ గడువు రేపటితో ముగుస్తుండటంతో అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయడానికి క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో దుబ్బాక (Dabbaka) బీఆర్ఎస్ (BRS) అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి (Prabhakar Reddy) నామినేషన్ దాఖలు చేశారు.
ఎన్నికల ప్రచారంలో దాడికి గురైన ప్రభాకర్ రెడ్డి సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆయన ఆస్పత్రి నుంచి అంబులెన్స్ లో నేరుగా దుబ్బాక వచ్చారు. అక్కడి నుంచి వీల్ చైర్ లో వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. మరోవైపు అక్టోబర్ 30 నాడు దుబ్బాకలో బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం సంచలనం సృష్టించింది.
దాడికి నిరసనగా బీఆర్ఎస్ అక్టోబర్ 31న దుబ్బాక బంద్ కు పిలుపునిచ్చింది. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. భారీ ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు ర్యాలీలు కూడా నిర్వహించారు. అంతేకాకుండా దుబ్బాక బీజేపీ (BJP) ఎంపీ రఘునందన్ (MP Raghunandan) దిష్టిబొమ్మ కూడా దహనం చేశారు. మరోవైపు ఈ దాడి ఘటన పలు అనుమానాలకు దారితీసిందంటున్నారు. నిందితుడు దొరికిన ఇప్పటి వరకు ఈ సంఘటన ఎందుకు జరిగింది అనే నిజం ఇంకా వెల్లడి కాకపోవడం బీఆర్ఎస్ వర్గాలలో చర్చలకు దారితీసింది..