ఆర్మూరు(Armur) ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్(KTR)కు తృటిలో ప్రమాదం తప్పిన సంగతి తెలిసిందే. ర్యాలీగా నామినేషన్‌కు వెళ్తుండగా వాహనం అదుపుతప్పి కిందపడ్డారు కేటీఆర్. దీంతో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రచార రథం రెయిలింగ్ విరగడంతో కేటీఆర్ ముందుకు పడిపోయారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది కేటీఆర్‌ను గట్టిగా పట్టుకోవడంతో పెను ప్రమాదం తప్పింది.
ఈ ఘటనలో నేలపై పడిన ఎంపీ సురేష్‌రెడ్డి స్వల్పగాయాలతో బయటపడ్డారు. స్వల్పగాయాలే కావడంతో కేటీఆర్.. జీవన్‌రెడ్డితో కలిసి నామినేషన్ కేంద్రానికి వెళ్లారు. అనంతరం కొడంగల్‌లోనూ పర్యటించారు. అయితే ఈ ప్రమాదంపై మంత్రి కేటీఆర్ తాజాగా స్పందించారు. తనకు జరిగిన ప్రమాదంపై నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో ఎన్నికల ప్రచారం సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు.
‘ఆ ప్రమాదం ఒకవిధంగా మంచి శకునంగానే భావిస్తున్నా.. ఎందుకంటే 2014లోనూ ఇలాంటిదే జరిగింది.. అప్పుడు ఎన్నికల్లో తాను గెలిచాను.. ఇప్పుడు కూడా గెలవబోతున్నా.. అంటూ కేటీఆర్ కామారెడ్డి ప్రచార సభలో చెప్పుకొచ్చారు. ప్రమాదంలో తాను కింద పడిపోకుండా గన్ మెన్ సాయం చేశారని మంత్రి వెల్లడించారు.
అదేవిధంగా కామారెడ్డిలో జరిగిన కాంగ్రెస్ సభలో కర్ణాటక సీఎం సిద్దరామయ్య వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వానిది 5 గంటల ఫెయిల్యూర్ మోడల్ అయితే తెలంగాణలో బీఆర్ఎస్ సర్కార్‌ది 24 గంటల పవర్-ఫుల్ మోడల్ అని అన్నారు. పదేళ్ల ప్రస్థానం తర్వాత ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు ప్రజాభిమానం వెల్లువెత్తుతున్న పాలన తమదని కేటీఆర్ వెల్లడించారు. అధికారం చేపట్టి ఆరు నెలలు గడవకముందే తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీదని విమర్శించారు.