Telugu News » KTR : ‘గృహ జ్యోతి’హామీ అమలు చేసే వరకు బిల్లు కట్టొద్దు… ప్రజలకు కేటీఆర్ పిలుపు….!

KTR : ‘గృహ జ్యోతి’హామీ అమలు చేసే వరకు బిల్లు కట్టొద్దు… ప్రజలకు కేటీఆర్ పిలుపు….!

మఖలో పుట్టి పుబ్బలో పోయే పార్టీ అంటూ గతంలో ఎందరో నీల్గిండ్రని అన్నారు. రెండున్నర దశాబ్దాలు పార్టీ నిలబడి, రేవంత్ రెడ్డి లాంటి వాళ్లను టీఆర్ఎస్ మట్టికరిపించిందని పేర్కొన్నారు.

by Ramu
KTR Call for people not to pay electricity bills

రేవంత్ రెడ్డి (Revanth Reddy) లాంటి నాయకులను టీఆర్ఎస్ పార్టీ తన ప్రస్థానంలో ఎంతో మందిని చూసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. మఖలో పుట్టి పుబ్బలో పోయే పార్టీ అంటూ గతంలో ఎందరో నీల్గిండ్రని అన్నారు. రెండున్నర దశాబ్దాలు పార్టీ నిలబడి, రేవంత్ రెడ్డి లాంటి వాళ్లను టీఆర్ఎస్ మట్టికరిపించిందని పేర్కొన్నారు.

KTR Call for people not to pay electricity bills

ఈ నెల కరెంట్ బిల్లులు ఎవరూ కట్టవద్దని ప్రజలకు కేటీఆర్ పిలుపునిచ్చారు. హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ….. 100 మీటర్ల లోపల పార్టీని బొంద పెట్టే విషయాన్ని తర్వాత చూసుకుందామని అన్నారు. ముందు వంద రోజుల్లో నెరవేరుస్తామన్న హామీలను అమలు చేసే అంశంపై రేవంత్ రెడ్డి దృష్టి పెట్టాలని సూచించారు.

అహంకారంతో మాట్లాడిన రేవంత్ రెడ్డి లాంటి నేతలను ఎంతో మందిని టీఆర్ఎస్ తన ప్రస్థానంలో చూసిందన్నారు. తెలంగాణ జెండాను ఎందుకు బొంద పెడుతావ్
… తెలంగాణ తెచ్చినందుకా… తెలంగాణను అభివృద్ధి చేసినందుకా… మిమ్మలను, మీ దొంగ హమీలను ప్రశ్నిస్తునందుకా ? అని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన ఉచిత విద్యుత్ పథకం గృహజ్యోతి హామీని నెరవేర్చే దాకా బిల్లులు కట్టొద్దన్నారు. డబుల్ ఇంజన్ అంటే అదానీ, ప్రధాని అన్న రేవంత్ ఇప్పుడు ట్రిపుల్ ఇంజన్ గా మారాడంటూ ఎద్దేవా చేశారు. పార్లమెంట్ ఎన్నికల తర్వతా కాంగ్రెస్, బీజేపీలు కలిసి పోతాయన్నారు. రేవంత్ కాంగ్రెస్ ఎక్ నాథ్ షిండేగా మారతాడన్నారు.

రేవంత్ రెడ్డి రక్తమంతా బీజేపీదేనని విమర్శించారు. ఇక్కడ చోటా మోడీగా రేవంత్ రెడ్డి మారిండని ఫైర్ అయ్యారు. గతంలో అదాని గురించి అడ్డగోలుగా మాట్లాడిన రేవంత్ రెడ్డి ఈరోజు ఆదాని వెంటపడుతున్నాడని చెప్పారు. స్విట్జర్లాండ్‌లో రేవంత్ రెడ్డి అదానితో అలైబలై చేసుకున్నాడన్నారు. అదాని రేవంత్ రెడ్డి ఒప్పందాల అసలు, లొగుట్టు బయటపెట్టాలన్నారు.

You may also like

Leave a Comment