Telugu News » KTR : మునుగోడును కష్టపెట్టి.. ఫ్లోరోసిస్ బాధలకు కారకులెవరో ప్రజలే ఆలోచించాలి….!

KTR : మునుగోడును కష్టపెట్టి.. ఫ్లోరోసిస్ బాధలకు కారకులెవరో ప్రజలే ఆలోచించాలి….!

60 ఏండ్ల పాటు మునుగోడును కష్ట పెట్టి ఫ్లోరోసిస్ బాధలకు కారకులు ఎవరో ప్రజలంతా ఆలోచించాలని కోరారు. కరెంట్ కావాలో... కాంగ్రెస్ కావాలో ప్రజలే ఇక నిర్ణయించుకోవాలని తెలిపారు.

by Ramu
ktr fire on congress in munugodu

డబ్బు మదంతో ఎప్పుడైనా గెలవొచ్చు అనే అహంకారంతో కొంత మంది పోటీలో ఉన్నారని, వాళ్లకు మునుగోడు (Munugodu) ప్రజలు బుద్ది చెప్పాలని మంత్రి కేటీఆర్ (KTR) అన్నారు. 60 ఏండ్ల పాటు మునుగోడును కష్ట పెట్టి ఫ్లోరోసిస్ బాధలకు కారకులు ఎవరో ప్రజలంతా ఆలోచించాలని కోరారు. కరెంట్ కావాలో… కాంగ్రెస్ కావాలో ప్రజలే ఇక నిర్ణయించుకోవాలని తెలిపారు.

ktr fire on congress in munugodu

మునుగోడు బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డితో కలిసి చౌటుప్పల్ వరకు రోడ్ షో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ…. మునుగోడు ఫ్లోరైడ్ గోసను కేసీఆర్ సీఎం అయ్యాక తీర్చారని చెప్పారు. 60 ఏండ్ల పాలనలో మునుగోడు ప్రజల గోడును కాంగ్రెస్ పట్టించుకోలేదన్నారు. ఇప్పుడు వచ్చి ఒక సారి తమకు అవకాశం ఇవ్వాలని అడుగుతున్నారని మండిపడ్డారు.

11 సార్లు అవకాశం ఇస్తే ఏం చేశారంటూ కాంగ్రెస్ పై విరుచుకు పడ్డారు. కాంగ్రెస్ హయాంలో కరెంట్ కోతలు, మోటార్లు, ట్రాన్స్ ఫార్మర్‌లు పెలిపోయేవన్నారు. 55 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో రైతుబంధు, కల్యాణలక్ష్మి, రైతు బీమా ఇవ్వలేదని విమర్శలు గుప్పించారు. కరెంట్ రావడం లేదని రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి మాట్లాడుతున్నారన్నారు. తానే స్వయంగా ఓ బస్సును ఏర్పాటు చేస్తానని అందులో మునుగోడు నియోజక వర్గంలో ఎక్కడికైనా వెళ్లి కరెంట్ తీగలను పట్టుకుకోవాలన్నారు. అప్పుడు కరెంట్ వస్తుందో లేదో తెలుస్తుందన్నారు.

గాడిదలకు గడ్డి వేసి ఆవును పాలివ్వమంటే ఎలా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు ఓటు వేసి కూసుకుంట్లను పనిచేయమంటే అలానే ఉంటుందన్నారు. ఇప్పటికే తాను మునుగోడు నియోజకవర్గాన్ని దత్తత తీసుకున్నానని వెల్లడించారు. బీఆర్ఎస్ ను గెలిపిస్తే రాబోయే రోజుల్లో మునుగోడును మరింత అభివృద్ధి చేస్తానన్నారు. లక్ష్మణాపురం ప్రాజెక్టు భూనిర్వాసితుల సమస్యలను కూడా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

2009లో తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన సమయంలో అప్పటి స్పీకర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలమంతా మర్రిగూడకు వచ్చామని గుర్తు చేశారు. ఆ రోజే నియోజకవర్గంలో ఫ్లోరోసిస్ గోడు చూసి చలించి పోయానని తెలిపారు. నీళ్లు తాగకుండా ఉండలేక తప్పక నీళ్లు తాగారని దాంతో కాళ్లు వంకర పోయి అవిటి వాళ్ళుగా మారారని గుర్తు చేశారు.ఆ పరిస్థితులు కల్లారా చూసిన సీఎం కేసీఆర్ నియోజకవర్గంలో ఫ్లోరోసిస్ గోసను తీర్చారని వివరించారు.

You may also like

Leave a Comment