తొమ్మిదేండ్ల బీఆర్ఎస్ (BRS) పాలనలో ఎంతో అభివృద్ధిని సాధించామని మంత్రి కేటీఆర్ (KTR) అన్నారు. దుర్గం చెరువు (Durgamcheruvu)పై వున్న దానికన్నా అందమైన వంతెనల (Bridge)ను నిర్మిస్తామని వెల్లడించారు. గోదావరి జలాలతో గండిపేట చెరువును నింపుతామని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 30,000 డబుల్ బెడ్ రూం ఇండ్లను పంపిణీ చేసుకున్నామన్నారు.
త్వరలోనే మరో 40,000ల ఇళ్లను పంపిణీ చేస్తామన్నారు. నగరంలో నిర్మించిన పలు వంతెనలకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ…..ఒకప్పుడు హైదరాబాద్కు మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చిన నదిగా మూసి నది వుండేదన్నారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల మూసి నది మురికి కూపంగా మారిందని మండిపడ్డారు.
మూసీ పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా ఈరోజు కీలకమైన మొదటి అడుగు పడుతుందన్నారు. మొదట ఫతుళ్ల గూడ- ఫిర్జాదీ గూడ వంతెనను కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం ఉప్పల్ శిల్పారామం చేరుకుని అక్కడ 5 మూసీ వంతెనలకు శంకుస్థాపన చేశారు. అనంతరం మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ… 2020లో మూసారాం బాగ్ లో వరదలు వచ్చిన విషయాన్ని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు.
ఆ సమయంలో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారన్నారు. రూ.545 కోట్లతో మూసీ, ఈసీ నదులపై 14 వంతెనలను నిర్మిస్తున్నట్టు చెప్పారు. కరోనా నేపథ్యంలో కొన్ని పనులను చేయలేకపోయామని పేర్కొన్నారు. 100 శాతం మురుగు నీటిని శుద్ధి చేసేందుకు ఎస్టీపీలను నిర్మిస్తున్నామని వెల్లడించారు.