Telugu News » KTR : బీజేపీ స్ఫూర్తితో మైనార్టీ డిక్లరేషన్ ఇచ్చినట్టు ఉంది..!

KTR : బీజేపీ స్ఫూర్తితో మైనార్టీ డిక్లరేషన్ ఇచ్చినట్టు ఉంది..!

బీజేపీ స్ఫూర్తితో మైనార్టీ డిక్లరేషన్ ఇచ్చినట్టుగా ఉందని ఎద్దేవా చేశారు.

by Ramu

కాంగ్రెస్ మైనార్టీ డిక్లరేషన్ పై మంత్రి కేటీఆర్ (KTR) విమర్శలు గుప్పించారు. మైనార్టీల విషయంలో బీజేపీ (BJP), కాంగ్రెస్ (Congress) ఆలోచనలు ఒకేలా ఉన్నాయని విమర్శించారు. బీజేపీ స్ఫూర్తితో మైనార్టీ డిక్లరేషన్ ఇచ్చినట్టుగా ఉందని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ మైనారిటీ డిక్లరేషన్ లోప భూయిష్టంగా ఉందని అన్నారు. గతంలో చాలా సార్లు కాంగ్రెస్ తప్పుడు వాగ్ధానాలు ఇచ్చిందని ఆయన విమర్శలు గుప్పించారు. బీసీలు, ముస్లింలకు మధ్య గొడవలు పెట్టాలని కాంగ్రెస్ చూస్తోందని ఆరోపించారు. బీసీల కులగణనలోకి ముస్లింలను చేర్చుతామని కాంగ్రెస్​ డిక్లరేషన్​ చెబుతోందని వెల్లడించారు.

ఇది కాంగ్రెస్ చేస్తున్న కుట్ర అని ధ్వజమొత్తారు. 2004-2014 మధ్య మైనారిటీలకు కాంగ్రెస్ ఏం చేసిందని నిలదీశారు. ఈ పదేండ్ల కాలంలో మైనారిటీల కోసం బీఆర్​ఎస్​ సర్కార్ ఏకంగా రూ.10 వేల కోట్లు ఖర్చు చేసిందని చెప్పారు. ఈ డిక్లరేషన్​ను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

గజ్వేల్​లో కేసీఆర్​పై పోటీ చేస్తున్న ఈటల రాజేందర్​, కామారెడ్డిలో రేవంత్​రెడ్డి ఇద్దరూ ఓడిపోతారని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఈసారి రాష్ట్రంలో బీజేపీ కనీసం ఒక్క సీటు కూడా గెలవదని పేర్కొన్నారు. నిన్న ముస్లిం ఓటర్లను ఆకర్షించేందుకు మైనారిటీ డిక్లరేషన్ ను కాంగ్రెస్ విడుదల చేసింది.

You may also like

Leave a Comment