తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు(KTR) ఓట్వీట్ చేశారు. బీఆర్‌ఎస్(BRS) ఒత్తిడితోనే కేఆర్‌ఎంబీ(KRMB)కి ప్రాజెక్టులను అప్పగించట్లేదని అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం తీర్మానాన్ని ప్రవేశపెడుతోందని పేర్కొన్నారు.
కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పజెప్పడానికి నిరసనగా రేపు నల్లగొండలో బీఆర్‌ఎస్ తలపెట్టిన ‘చలో నల్లగొండ’ సభ వల్లే కాంగ్రెస్‌లో చలనం వచ్చిందని కేటీఆర్ రాసుకొచ్చారు. ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్‌ఎస్‌కు దక్కిన మొదటి విజయంగా భావిస్తున్నామని సామాజిక మాధ్యమం ఎక్స్ (ట్విట్టర్)లో కేటీఆర్ పోస్ట్ చేశారు.
మరోవైపు, అసెంబ్లీలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నోట్‌ను విడుదల చేసింది. ‘కృష్ణా ప్రాజెక్టులపై వాస్తవాలు, కేసీఆర్ తప్పిదాలు.. లోప భూయిష్ట విధానాలు’ పేరుతో ప్రభుత్వం నోట్ విడుదల చేసింది. కృష్ణా బేసిన్‌లో తెలంగాణ ప్రయోజనాలు కాపాడటంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని ఆ నోట్‌లో పేర్కొంది.
తెలంగాణ ప్రయోజనాలను కాపాడేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, కేసీఆర్ పాపాలు.. తెలంగాణకు శాపంగా మారాయని.. కృష్ణా బేసిన్ ప్రాజెక్టులు అప్పగించే ప్రసక్తి లేదని తెలిపింది. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా రాబట్టేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొంది.
ఛలో నల్గొండ ఎఫెక్ట్!
కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పచెప్పడానికి నిరసనగా రేపు నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన 'ఛలో నల్గొండ' సభ సృష్టించిన ఒత్తిడి వల్ల.. కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించట్లేమని నేడు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టనున్న కాంగ్రెస్ ప్రభుత్వం.
It’s… pic.twitter.com/0ysa6aUqFC
— KTR (@KTRBRS) February 12, 2024