Telugu News » Ktr tweet: ఆలోచించు రైతన్నా.. ఏది కావాలి మనకు?: మంత్రి కేటీఆర్

Ktr tweet: ఆలోచించు రైతన్నా.. ఏది కావాలి మనకు?: మంత్రి కేటీఆర్

న్నికల నేపథ్యంలో రైతాంగాన్ని ఉద్దేశిస్తూ మంత్రి కేటీఆర్(Minister Ktr Tweet) ఓ ట్వీట్ చేశారు. తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ అమలు చేస్తున్న రైతు సంక్షేమాలను పోల్చి.. ఏది కావాలో ఎంచుకోవాలన్నారు.

by Mano
Ktr tweet: Think farmers.. What do we want?: Minister KTR

దసరా పండుగ వేడుకలు ముగిశాయి. రాష్ట్రంలో ఇక ఎన్నికల పండుగ మొదలైంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల(Telangana Elections) నేపథ్యంలో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్యే గట్టి పోటీ ఉండేలా కనిపిస్తోంది. ఈ క్రమంలో ప్రధాన పార్టీలన్నీ పోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయి. ఎన్నికల నేపథ్యంలో రైతాంగాన్ని ఉద్దేశిస్తూ మంత్రి కేటీఆర్(Minister Ktr Tweet) ఓ ట్వీట్ చేశారు.

september 17 the national unity day will be celebrated by the brs

తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ అమలు చేస్తున్న రైతు సంక్షేమాలను పోల్చి.. ఏది కావాలో ఎంచుకోవాలన్నారు. సీఎం కేసీఆర్ కావాలా? లేక రేవంత్ చెప్పిన 3గంటల కరెంటు కావాలా? అంటూ ఆయన చేసిన ట్వీట్ రైతులను ఆలోచింపజేసేలా ఉంది.

కేటీఆర్ ట్వీట్‌లో ఏమన్నారంటే.. ‘సీఎం కేసీఆర్ గారు కడుపునిండా ఇస్తున్న 24 గంటల కరెంటు కావాలా? లేదా కర్ణాటకలో కాంగ్రెస్ ఇస్తున్న 5 గంటల కరెంటు కావాలా? లేకపోతే తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెప్పిన 3 గంటల కరెంటు కావాలా?.. ఆలోచించు తెలంగాణ రైతన్నా. ఆరు దశాబ్దాలు ఆగం చేసిన వాళ్లు కావాలా? కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్‌ఫార్మర్లు మళ్లీ ఆ రోజులు రావాలా? లేదా రైతుబంధు, రైతుబీమా తెచ్చిన కేసీఆర్ కావాలా? చెరువులు బాగుచేసి, ప్రాజెక్టులు కట్టి, నెర్రెలు బారిన నేలను సస్యశామలం చేసిన కేసీఆర్ కావాలా? ఏది కావాలి మనకు? ఆలోచించు రైతన్నా?’ అని కేటీఆర్ పేర్కొన్నారు.

బీఆర్ఎస్ నేతలు ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యంగా కాంగ్రెస్ హయంలో వైఫల్యాలను తెరపైకి తెస్తున్నారు. ఇద్దరి హయాంలను గుర్తుచేసుకుని ఎవరి పాలన కావాలో తేల్చుకోవాలంటూ ప్రజలకు సూచిస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు గెలిచిన బీఆర్ఎస్.. హ్యాట్రిక్ కొట్టాలని చూస్తోంది. ఇందుకోసం సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో రైతాంగాన్ని ఉద్దేశిస్తూ మంత్రి కేటీఆర్ ఇవాళ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.

You may also like

Leave a Comment