Telugu News » Labours Killed In Kashmir: ఏడాదిలో తొలి ఉగ్రదాడి.. ఇద్దరు కార్మికులు మృతి..!

Labours Killed In Kashmir: ఏడాదిలో తొలి ఉగ్రదాడి.. ఇద్దరు కార్మికులు మృతి..!

జమ్ముకశ్మీర్​( Jammu Kashmir)లో ఉగ్రదాడి కలకలం రేపింది. శ్రీనగర్‌లో ముష్కరులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు కార్మికుల ప్రాణాలు కోల్పోయినట్లు కశ్మీర్‌ పోలీసులు(Kashmir Police) వెల్లడించారు.

by Mano
Labors Killed In Kashmir: First terrorist attack in a year.. Two laborers killed..!

జమ్ముకశ్మీర్​( Jammu Kashmir)లో ఉగ్రదాడి కలకలం రేపింది. శ్రీనగర్‌లో ముష్కరులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు కార్మికుల ప్రాణాలు కోల్పోయినట్లు కశ్మీర్‌ పోలీసులు(Kashmir Police) వెల్లడించారు. ఒకరు ఘటనాస్థలంలోని మృతిచెందగా మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయినట్లు తెలిపారు. పోలీసులు ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

Labors Killed In Kashmir: First terrorist attack in a year.. Two laborers killed..!

ఈ ఏడాదిలో ఉగ్రవాదులు టార్గెట్ చేసిన తొలి ఘటన ఇది. బుధవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులు పంజాబ్(Punjab)​లోని అమృత్‌ సర్‌కు చెందిన అమృత్‌పాల్‌ సింగ్‌, రోహిత్‌గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరూ ఒకే గ్రామానికి చెందిన స్నేహితులుగా కాగా ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

శ్రీనగర్​లో స్థానికేతరులపై జరిగిన దాడిని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ నేతలు ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా ఖండించారు. శ్రీనగర్‌లోని షాల్ కదల్​లో కార్మికుల ప్రాణాలను ఉగ్రవాదులు బలిగొన్న అనాగరిక ఘటన తెలిసి దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఈ విషయాన్ని నేషనల్ కాన్ఫెరెన్స్​ పార్టీ సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొంది.

గతేడాది అనంత్‌నాగ్, షోపియాన్ జిల్లాల్లో స్థానికేతర కార్మికులపై ఉగ్రవాదులు అనేకసార్లు దాడులకు పాల్పడ్డారు. మే 30వ తేదీ అనంత్‌నాగ్ జిల్లాలో సర్కస్ కార్మికుడిపై, బిహార్‌కు చెందిన ఇటుక బట్టి కార్మికుడు ముకేశ్ కుమార్‌ను అక్టోబర్ 31న పుల్వామా జిల్లాలో కాల్పులు జరిపి చంపేశారు. అదేవిధంగా జూలై 13న షోపియాన్ జిల్లాలోని గాగ్రెన్ ప్రాంతంలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో ముగ్గురు కూలీలు గాయాలపాలయ్యారు.

 

You may also like

Leave a Comment