తెలంగాణ (Telangana) ఆడపడచు అని అనుకొంటున్న కవిత (Kavitha).. బీఆర్ఎస్ (BRS) అధికారం కోల్పోయే వరకు మహారాణిలా చలామణి అయ్యింది. కానీ నేడు లిక్కర్ కేసులో తీహార్ జైలు (Tihar Jail)లో ఉన్న విషయం తెలిసిందే.. కాగా అక్కడి జైలు అధికారుల తీరుపై సీరియస్ అయిన ఆమె.. రౌస్ అవెన్యూ కోర్టు (Rouse Avenue Court)ను ఆశ్రయించారు..
జైలు అధికారులు కోర్టు ఇచ్చిన ఆదేశాలను పట్టించుకోవడం లేదని గురువారం పిటిషన్ దాఖలు చేశారు.. మరోవైపు జైల్లో కవితకు ఇంటి భోజనం, పరుపులు, చెప్పులు, పెన్నులు, బెడ్‌షీట్స్, పేపర్లు తెప్పించుకునేందుకు కోర్టు వెసులుబాటు కల్పించింది. అయితే జైలు అధికారులు మాత్రం వీటిని అనుమతించడం లేదని కోర్టును ఆశ్రయించింది. ఇంటి భోజనం సహా మిగతా వెసులుబాట్లు కల్పించేలా జైలు అధికారులను ఆదేశించాలని పిటిషన్‌లో పేర్కొంది.
ఇక ఢిల్లీ (Delhi) మద్యం కేసులో 14 రోజుల రిమాండ్ నిమిత్తం కవిత ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు.. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 9వ తేదీ వరకు ఆమె రిమాండ్ కొనసాగనుంది. అయితే, హైబీపీ కారణంగా జైలులో కవితకు కొన్ని వెసులుబాట్లు కల్పించేందుకు కోర్టు అంగీకరించిది. అంతేకాదు.. ఒంటిపై బంగారు ఆభరణాలు సైతం పెట్టుకొనే వీలు కల్పించింది.
కానీ అధికారులు కోర్టు ఆదేశాలు ధిక్కరిస్తున్నట్లు పేర్కొంటూ.. కోర్టును ఆశ్రయించారు. మరోవైపు కవిత పిటిషన్‌పై స్పందించిన కోర్టు ఎల్లుండి విచారిస్తామని ప్రకటించింది. ఇదిలా ఉండగా ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టయి తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ మాజీ మంత్రులు మనీశ్ సిసోడియా, సంజయ్ సింగ్ తర్వాత మూడో రాజకీయ నేత కవిత కావడం గమనార్హం.