Telugu News » Liquor Scam: లిక్కర్ స్కాం కేసులో మనీష్ సిసోదియా కస్టడీ పొడిగింపు!

Liquor Scam: లిక్కర్ స్కాం కేసులో మనీష్ సిసోదియా కస్టడీ పొడిగింపు!

ఢిల్లీ లిక్కర్ స్కాం(Liquor Scam) కేసులో అరెస్టైన ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా(manish sisodia) కు కోర్టులో మరో షాక్ తగిలింది.

by Mano
Liquor Scam: Manish Sisodia custody extension in liquor scam case!

ఢిల్లీ లిక్కర్ స్కాం(Liquor Scam) కేసులో అరెస్టైన ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా(manish sisodia) కు కోర్టులో మరో షాక్ తగిలింది. గురువారం ఆయన్ని కోర్టులో హాజరుపరచగా సిసోదియా రిమాండ్‌ను నవంబర్ 22వరకు పొడిగించాలని రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు ఇచ్చింది.

Liquor Scam: Manish Sisodia custody extension in liquor scam case!

లిక్కర్ స్కాంలో డాక్యుమెంట్లను తనిఖీ చేయాలని నిందితుల తరఫు న్యాయవాదులను కోర్టు ఆదేశించింది. సీబీఐ వేసిన ఈ కేసు తదుపరి విచారణను నవంబర్ 22కు వాయిదా వేసింది. ఈ కుంభకోణంలో సిసోడియా పాత్ర ఉందని ఆరోపిస్తూ ఫిబ్రవరి 26న సీబీఐ ఆయన్ను అరెస్టు చేయగా అప్పటి నుంచి కస్టడీలోనే ఉన్నారు.

మనీలాండరింగ్ కేసులో సిసోడియాను తీహార్ జైలులో విచారించిన తర్వాత మార్చి 9న సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో పేరు నమోదు చేసింది. లిక్కర్ టెండర్లలో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగాయి. అప్పటి నుంచి లిక్కర్ స్కాంలో దేశంలోని చాలా మంది కీలక నేతలు అరెస్ట్ అయ్యారు.

సిసోదియా పేరు ఎఫ్ఐఆర్‌లో చేర్చడాన్ని ఆప్ ఖండించింది. ఎలాంటి తప్పు చేయకుండా సిసోదియాను అరెస్ట్ చేయడం ఏంటని సీబీఐ అధికారులను ప్రశ్నిస్తోంది. కేంద్రంలోని బీజేపీ సర్కార్ ప్రతిపక్ష నేతలే టార్గెట్ గా దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతున్నారని, బీజేపీ చేతిలో పెంపుడు కుక్కలా మారాయని ఆప్ నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. స్కాంలో ఎమ్మెల్సీ కవిత పేరు ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

You may also like

Leave a Comment