నిర్లక్ష్యం చిన్నగా కనిపిస్తున్నా దాని ఫలితం మాత్రం భయంకరంగా ఉంటుందన్న విషయం తెలిసిందే.. ఈ నిర్లక్ష్యం వల్ల నిత్యం ఎందరో ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.. అయితే ఇలాంటి ఒక సంఘటన గోవా (Goa)లో చోటు చేసుకుంది.. కదులుతున్న కారుపై ఇద్దరు చిన్నారులు నిద్రిస్తున్న వీడియో సోషల్ మీడియా (Social Media)లో వైరల్‌గా మారింది.
గోవాలోని మాపుసా (Mapusa) పట్టణ సమీపంలో కదులుతున్న ఓ కారుపై ఇద్దరు చిన్నారులు ప్రమాదకర రీతిలో నిద్రిస్తూ కనిపించారు. పర్రా గ్రామం (Parra Village)లో బుధవారం ఓ టూరిస్టు వాహనంలో ఈ ఘటన చోటు చేసుకోగా.. ఓ వ్యక్తి వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం అది వైరల్‌గా మారింది. కారుపై చిన్నారులు పడుకొని ఉండటం చూసిన వ్యక్తి.. డ్రైవర్‌ను ప్రశ్నించగా అతడు సమాధానం చెప్పకుండా నిర్లక్ష్యంగా.. డ్రైవింగ్ చేస్తూ వెళ్లిపోవడం గమనార్హం.
ఈ ఘటనకు సంబంధించి మాపుసా పోలీసులు గుర్తుతెలియని ఆ డ్రైవర్ పై కేసు నమోదు చేసినట్టు సమాచారం.. మరోవైపు ఈ వీడియో చూసిన నెటిజన్లు సదరు వ్యక్తి బాధ్యతారహిత్యంపై మండిపడుతున్నారు. డ్రైవర్‌పై తగిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. గోవాకి రిలాక్స్ అవడానికి వచ్చారు. అలాంటి ఆనందాన్ని చెడగొట్టేలా ఉన్న ఇలాంటి విషయాల పట్ల తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి కదా అని నెటిజన్లు మండిపడుతున్నారు..
ఇలా కారుపై పడుకోవడం మీకు ఎంజాయ్ గా అనిపించినా.. ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే వెలకట్టలేని మూల్యం చెల్లించుకోవల్సి వస్తుంది. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా నడుచుకోవాలంటూ ఓ యూజర్ కామెంట్ సెక్షన్‌లో చెప్పుకొచ్చాడు. తల్లిదండ్రులు పిల్లల పట్ల నిర్లక్ష్యంగా ఉండటం విచారకరం అని పేర్కొన్నాడు..కాగా ఈ వీడియో డిసెంబర్ 27న పోస్టు చేసినట్టు తెలుస్తోంది..