Telugu News » Lok Sabha Election 2024 : దేశంలో ముగిసిన తొలి విడత పోలింగ్.. అత్యల్పంగా అక్కడే..!

Lok Sabha Election 2024 : దేశంలో ముగిసిన తొలి విడత పోలింగ్.. అత్యల్పంగా అక్కడే..!

లోక్‌సభ స్థానాలతో పాటు అరుణాచల్‌ ప్రదేశ్‌, సిక్కింలోని శాసనసభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇక ఆయా రాష్ట్రాల్లో పలువురు ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకొన్నారు.

by Venu

దేశ వ్యాప్తంగా తొలి విడత ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం నుంచి భానుడు భగ భగ మంటున్నా ఓటర్ల మాత్రం వెనక్కు తగ్గలేదు.. తమ ఓటు వినియోగించుకోవడానికి క్యూ కట్టారు. ఈ క్రమంలో పోలింగ్ కేంద్రాలు జనాలతో నిండిపోయాయి. మరోవైపు గతం కంటే ప్రస్తుతం ఆయా రాష్ట్రాల్లో ఓటింగ్ శాతం ఎక్కువగా నమోదైనట్లు సమాచారం.. ఇక మధ్యాహ్నం 3 గంటలకే 50 శాతం పోలింగ్ దాటిందని ఎన్నికల సంఘం వెల్లడించింది.

Arrangements for Telangana elections have been completedపోలింగ్ (Elections ) జరిగిన నియోజక వర్గాలలో సాయంత్రం 5గంటలకు ఎన్నికల పక్రియ ముగిసింది. మరోవైపు మొత్తం ఎంత పోలింగ్ శాతం నమోదైందనే విషయాన్ని ఈసీ (EC) అధికారికంగా మరికొద్ది సేపట్లో వెల్లడించనుందని తెలుస్తోంది. ఇదిలా ఉండగా కొన్ని రాష్ట్రాల్లో చెదురుమదురు ఘటనలు మినహా ఓటింగ్‌ ప్రశాంతంగా ముగిసిందని అధికారులు పేర్కొన్నారు..

మరోవైపు మొదటి విడతలో 21 రాష్ట్రాలు.. కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 స్థానాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలుస్తోంది. ఈశాన్య రాష్ట్రం త్రిపుర (Tripura)లో అత్యధికంగా పోలింగ్‌ నమోదైనట్లు సమాచారం. ఆ తర్వాత మణిపూర్‌ (Manipur), మేఘాలయ (Meghalaya), అస్సాంలో ఎక్కువ మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొన్నట్లు తెలుస్తోంది.

అలాగే బీహార్‌ (Bihar)లో అత్యల్పంగా పోలింగ్‌ నమోదైనట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా లోక్‌సభ స్థానాలతో పాటు అరుణాచల్‌ ప్రదేశ్‌, సిక్కింలోని శాసనసభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇక ఆయా రాష్ట్రాల్లో పలువురు ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకొన్నారు. వృద్ధులు, కొత్త జంటలు ఓటు వేసి పలువురికి ఆదర్శంగా నిలిచినట్లు వారిని చూసిన వారు అనుకొంటున్నారు..

You may also like

Leave a Comment