Telugu News » Lok Sabha Elections 2024 : లోక్‌సభ-అసెంబ్లీ ఎన్నికల కోసం సిద్దం అవుతున్న కేంద్ర బలగాలు.. 3.40 లక్షల మంది మోహరింపు..!

Lok Sabha Elections 2024 : లోక్‌సభ-అసెంబ్లీ ఎన్నికల కోసం సిద్దం అవుతున్న కేంద్ర బలగాలు.. 3.40 లక్షల మంది మోహరింపు..!

ఎన్నికల నేపథ్యంలో 3400 కంపెనీల పారామిలిటరీ విభాగాలను అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కలిపి మోహరించాలని కోరుతూ ఎన్నికల సంఘం పంపిన ప్రతిపాదనను.. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిగణలోకి తీసుకొని, సీఏపీఎఫ్‌ని మోహరించాలని నిర్ణయించుకొందని సమాచారం.

by Venu
lokhsabha-elections

లోక్‌సభ ఎన్నికలకు (Lok Sabha Elections) సమయం దగ్గరపడుతుండటంతో కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. ఈ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh), అరుణాచల్ ప్రదేశ్ (Arunachal Pradesh), ఒడిశా, సిక్కిం రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఈ ఎన్నికలన్ని సజావుగా జరిగేలా చర్యలు చేపడుతోన్న ఈసీ.. ఇందుకోసం 3.40 లక్షల మంది సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్స్ (CAPF) బలగాలను మోహరించే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Telangana Elections: If you take a selfie there, that's it.. Easy warning!

ఎన్నికల నేపథ్యంలో 3400 కంపెనీల పారామిలిటరీ విభాగాలను అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కలిపి మోహరించాలని కోరుతూ ఎన్నికల సంఘం పంపిన ప్రతిపాదనను.. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిగణలోకి తీసుకొని, సీఏపీఎఫ్‌ని మోహరించాలని నిర్ణయించుకొందని సమాచారం. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, శాంతియుతంగా జరిగేలా చూసేందుకు ముందు చూపుతో వ్యవహరిస్తోందని తెలుస్తోంది.

కాగా లోక్‌సభలోని 543 స్థానాలకు ఏప్రిల్-మేలో ఎన్నికలు జరగనున్నాయి. ఈమేరకు ఈసీ.. గరిష్టంగా 920 CAPF కంపెనీలను పశ్చిమ బెంగాల్‌ కోసం కోరింది.. జమ్మూ మరియు కాశ్మీర్‌లో 635 కంపెనీలు కావాలని.. బీహార్‌కి 295, ఛత్తీస్‌గఢ్ లో 360,  యూపీకి 252 కంపెనీల బలగాలను కోరగా.. ఏపీ, పంజాబ్, జార్ఖండ్ రాష్ట్రాలకు ఒక్కొక్కటికి 250 కంపెనీలు, రాజస్థాన్, గుజరాత్, మణిపూర్, తమిళనాడు రాష్ట్రాల్లో ఒక్కొక్కటికి 200 కంపెనీలను కోరింది.

మరోవైపు ఒడిశా (Odisha)కు 175, అస్సాం, తెలంగాణ (Telangana)కు 160 కంపెనీల చొప్పున, మహారాష్ట్రలో 150; మధ్యప్రదేశ్‌లో 113.. త్రిపురలో 100.. హర్యానాలో 95.. అరుణాచల్ ప్రదేశ్‌లో 75.. కర్ణాటక, ఉత్తరాఖండ్ మరియు ఢిల్లీలో 70 చొప్పున బలగాలను కోరింది. కేరళలో 66.. లద్దాఖ్‌లో 57.. హిమాచల్ ప్రదేశ్‌లో 55.. నాగాలాండ్‌లో 48.. సిక్కింలో 17.. మేఘాలయలో 45.. మిజోరంలో 15.. దాద్రా మరియు నగర్ హవేలీలో 14.. పుదుచ్చేరిలో 10.. చండీగఢ్‌లో 11.. గోవాలో 12.. అండమాన్ మరియు నికోబార్‌లో ఐదు, లక్షద్వీప్‌కి మూడు కంపెనీలు కావాలని ఈసీ (EC) కోరింది.

You may also like

Leave a Comment