Telugu News » Lokesh: కరువుతో ఊళ్లకు ఊళ్లు ఖాళీ అవుతున్నాయ్..: నారా లోకేశ్

Lokesh: కరువుతో ఊళ్లకు ఊళ్లు ఖాళీ అవుతున్నాయ్..: నారా లోకేశ్

రైతాంగాన్ని కరువుకు వదిలేసిన కర్కశ ప్రభుత్వం అంటూ వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కరువుపై చర్చించని క్యాబినెట్ మీటింగ్ (AP Cabinet Meeting)ఎందుకు? అని ప్రశ్నించారు.

by Mano
Lokesh: Villages are becoming empty due to drought..: Nara Lokesh

జగన్ పాలనలో కరువు కారణంగా ఊళ్లకు ఊళ్లు ఖాళీ అవుతున్నాయని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ (TDP Leader Nara Lokesh) అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతాంగాన్ని కరువుకు వదిలేసిన కర్కశ ప్రభుత్వం అంటూ వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కరువుపై చర్చించని క్యాబినెట్ మీటింగ్ (AP Cabinet Meeting)ఎందుకు? అని ప్రశ్నించారు.

Lokesh: Villages are becoming empty due to drought..: Nara Lokesh

కర్నూలు జిల్లాలో కరువు కారణంగా పనుల్లేక ఊళ్లకు ఊళ్లు ఖాళీ అవువుతున్నాయన్న వార్తలు ఆందోళనకు గురిచేస్తున్నాయన్నారు లోకేశ్. వందేళ్లలో ఈ ఏడాదే అతి తక్కువ వర్షపాతం నమోదైనట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. సీఎం జగన్‌కు రాజకీయ ప్రత్యర్థులను తప్పుడు కేసుల్లో ఇరికించడంపై ఉన్న శ్రద్ధ కరువుతో అల్లాడుతున్న రైతాంగాన్ని ఆదుకోవడంపై లేదని మండిపడ్డారు.

అడ్డగోలు దోపిడీపై తప్ప కరువు నివారణ చర్యలు చేపట్టాలన్న సోయి లేదన్నారు. తీవ్ర కరువు పరిస్థితుల్లో రైతాంగం ఉంటే… వారి సమస్యలపై క్యాబినెట్ సమావేశంలో కనీసం చర్చించకపోవడం జగన్ ప్రభుత్వానికి అన్నదాతల సమస్యల పట్ల ఉన్న చిత్త‌శుద్ధికి నిద‌ర్శ‌నమన్నారు. వ‌ర్షాభావ ప‌రిస్థితుల‌పై ప్రభుత్వం కనీసం సమీక్ష చేయకపోవడం బాధ్యతారాహిత్యమని విమర్శించారు.

400 మండలాల్లో కరువు పరిస్థితులు ఉంటే కేవలం 100 మండలాల్లో కరువు అని ప్రభుత్వం ప్రకటించడం దారుణమని లోకేశ్ అన్నారు. క‌రువు కోర‌ల్లో చిక్కి రైతాంగం విల‌విల్లాడుతున్న ఈ కష్టకాలంలో నిబంధనలను సడలించి అయినా యుద్ధప్రాతిపదికన రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.

You may also like

Leave a Comment