Telugu News » LB Nagara Crime: ఎల్బీ నగర్‌ లో రెచ్చిపోయిన ప్రేమోన్మాది..ప్రేయసి, తమ్ముడి మీద కత్తితో దాడి!

LB Nagara Crime: ఎల్బీ నగర్‌ లో రెచ్చిపోయిన ప్రేమోన్మాది..ప్రేయసి, తమ్ముడి మీద కత్తితో దాడి!

తీవ్ర ఆగ్రహానికి గురైన శివకుమార్ తన తెచ్చుకున్న కత్తితో ఇద్దరిపై దాడికి దిగాడు.

by Sai
lover attack on girl friend and her brother with knife in lb nagar hyderabad

– కత్తితో దాడి చేయడంతో తీవ్రరక్తస్రావమై..మృతి చెందిన బాలుడు

హైదరాబాద్ (Hyderabad) ఎల్బీనగర్‌లో పట్టపగలే ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ప్రేమించిన అమ్మాయి ఇంటికి మాట్లాడాటానికి అని వెళ్లి..ప్రేయసి మీద, ఆమె తమ్ముడి మీద కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో తమ్ముడు చనిపోగా…అక్కకి తీవ్ర గాయాలయ్యాయి. అయితే.. ఇంట్లోకి చొరబడి అక్కా, తమ్ముడిపై గుర్తు తెలియని యువకుడు దాడి చేశాడనుకున్న స్థానికులు.. ఆ దుండగున్ని ఇంట్లో బంధించి పోలీసులకు సమాచారం అదించారు. వాళ్లు వచ్చి ఆరా తీస్తే.. అసలు విషయం బయటపడింది.

lover attack on girl friend and her brother with knife in lb nagar hyderabad

దాడి చేసినవాడు. .. అమ్మాయిని ప్రేమిస్తున్న వ్యక్తేనని. వివరాల్లోకి వెళ్తే.. రామంతాపూర్‌కు చెందిన శివకుమార్, ఎల్బీనగర్‌ ఆర్టీసీ కాలనీకి చెందిన అమ్మాయి సంఘవి గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి విషయం మాట్లాడేందుకు యువకుడు ఆదివారం యువతి ఇంటికి వెళ్లాడు. తనను పెళ్లి చేసుకోవాలని యువతిపై యువకుడు ఒత్తిడి చేశాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.

అయితే.. వీళ్లిద్దరి మధ్య గొడవ జరిగే సమయంలో యువతి తమ్ముడు పృథ్వీ ఇంట్లోనే ఉన్నాడు. శివకుమార్‌ పైన అక్కా తమ్ముడు ఇద్దరు సీరియస్ అయ్యారు. దీంతో.. తీవ్ర ఆగ్రహానికి గురైన శివకుమార్ తన తెచ్చుకున్న కత్తితో ఇద్దరిపై దాడికి (Attack) దిగాడు. ప్రియురాలిపై దాడి చేసేందుకు ప్రయత్నించగా.. తమ్ముడు అడ్డు రావటంతో అతనిపై కత్తి వేటు పడింది. అనంతరం తన ప్రేయసి పై కూడా శివకుమార్ దాడి చేయటంతో.. వాళ్ల అరుపులకు ఇరుగుపొరుగు వాళ్లు వచ్చి.. ఆ యువకున్ని బంధించారు.

వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.అయితే.. కత్తి వేటు పడ్డ ఆ అమ్మాయి తమ్ముడికి తీవ్ర రక్తస్రావం జరగటంతో అతడు మృతి చెందాడు. యువతి కూడా తీవ్రంగా గాయపడింది. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దాడికి పాల్పడిన యువకుడిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. కత్తి పోట్లతో తీవ్రంగా గాయపడిన యువతి ప్రస్తుతం ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా.. పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

You may also like

Leave a Comment