Telugu News » Lucknow: వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్లదాడి.. భయాందోళనకు గురైన ప్రయాణికులు..!

Lucknow: వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్లదాడి.. భయాందోళనకు గురైన ప్రయాణికులు..!

ఈ రైళ్లు ప్రారంభించినప్పటి నుంచి ఇదివరకు నాలుగు సార్లు రాళ్ల దాడికి గురయ్యాయి. తాజాగా, గురువారం మరోసారి రాళ్ళ దాడి చోటుచేసుకుంది. దీనితో వందేభారత్ రాళ్లదాడికి గురికావడం ఇది ఐదోసారి.

by Mano
Lucknow: Stone pelting on Vandebharat Express.. Panic passengers..!

అధునాతన హంగులతో రూపొందించిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు(Vande Bharat Express) తరచూ రాళ్ల దాడికి గురవుతున్నాయి. ఈ రైళ్లు ప్రారంభించినప్పటి నుంచి ఇదివరకు నాలుగు సార్లు రాళ్ల దాడికి గురయ్యాయి. తాజాగా, గురువారం మరోసారి రాళ్ళ దాడి చోటుచేసుకుంది. దీనితో వందేభారత్ రాళ్లదాడికి గురికావడం ఇది ఐదోసారి.

Lucknow: Stone pelting on Vandebharat Express.. Panic passengers..!

వివరాలలోకి వెళితే.. గురువారం గోరఖ్‌పూర్(Gorakhpur) నుంచి లక్నో(Lucknow)కు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు బయల్దేరింది. ఈ క్రమంలో వందేభారత్ రసౌలీ స్టేషన్ సమీపంలోకి రాగానే రైలుపై దుండగులు ఒక్కసారిగా రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. రాళ్లు విసరడం వల్ల రైలులోని సి6 కోచ్‌లోని అద్దం పగిలిపోయింది.

కాగా, ఈ ఏడాది జులై 7వ తేదీన గోరఖ్ పూర్ నుంచి లక్నో వెళ్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు జూలై 11వ తేదీన రాళ్ల దాడికి గురైంది. ఆగస్టు 3వ తేదీన గోరఖ్‌పూర్ జంక్షన్‌లోని వాషింగ్ యార్డులో రైలు అద్దాలు పగులగొట్టారు. ఆగస్టు 6న బారాబంకిలోని సఫేదాబాద్‌ రైల్వే స్టేషన్ సమీపంలో మరో సారి ఈ రైలు రాళ్ల దాడికి గురైంది. సెప్టెంబర్ 15న మల్హార్ స్టేషన్‌లో గుర్తు తెలియని దుండగులు రాళ్లతో దాడి చేశారు.

తాజాగా జరిగిన రాళ్లదాడిని అధికారులు సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ రాళ్లదాడి ఘటనపై జీఆర్‌పీ, ఆర్‌పీఎఫ్ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో ఉత్తర రైల్వే సీనియర్ డీసీఎం రేఖా శర్మ మాట్లాడుతూ.. సీసీటీవీలను పరిశీలించి నిందితులను పట్టుకుంటామని చెప్పారు. అదేవిధంగా విచారణ జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

You may also like

Leave a Comment