Telugu News » Mamatha jogging : మాడ్రిడ్ లో మమత జాగింగ్..సాంప్రదాయ చీరకట్టులో మెరిసిన దీదీ..!

Mamatha jogging : మాడ్రిడ్ లో మమత జాగింగ్..సాంప్రదాయ చీరకట్టులో మెరిసిన దీదీ..!

పశ్చిమ బెంగాల్ పొలిటికల్ ఫైర్ బ్రాండ్..సీఎమ్ మమతా బెనర్జీ(Mamata Banerjee)స్పెయిన్ (Spain)పర్యటిస్తున్నారు. ఓ వాణిజ్య కార్య‌క్ర‌మం నిమిత్తం మాడ్రిడ్(Madrid)కు వెళ్లిన దీదీ సాంప్రదాయ చీరకట్టులోనే జాగింగ్ చేస్తూ క‌నిపించారు.

by sai krishna

చెప్పులు వేసుకుని మ‌రీ..మాడ్రిడ్ పార్క్‌ ను చుట్టేస్తున్నారు. సంబంధిత వీడియోను ఆమె త‌న ఇన్‌స్టాలో పోస్టు చేశారు.దీదీతో పాటు వెళ్లిన అధికార బృందం కూడా జాగింగ్ చేశారు. ఉద‌య‌మే జాగింగ్ చేస్తే రోజుకు కావాల్సిన శ‌క్తి వ‌స్తుంద‌ని ఆమె ఆ పోస్టుకు కామెంట్ కూడా చేశారు.

ఫిట్‌గా ఉంటేనే.. ఆరోగ్యంగా ఉంటార‌ని ఆమె పేర్కొన్నారు. చేతికి స్మార్ట్‌వాచ్ పెట్టుకుని జాగింగ్ చేసిన దీదీ..సాధార‌ణంగా ప్ర‌తి రోజూ ట్రెడ్‌మిల్‌(Treadmill)పై జాగ్ చేస్తుంటారు. స్పానిష్ ఫుట్‌బాల్ లీగ్ లా లీగాకు చెందిన అధ్యక్షుడిని మ‌మ‌తా క‌లుసుకోనున్నారు

You may also like

Leave a Comment