ఎన్నికల(Telangana Elections) వేళ రాజకీయ నాయకుల ఇళ్లలో పోలీసుల దాడులు కలకలం రేపుతున్నాయి. తాజాగా హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌లో కాంగ్రెస్ నేత మధుయాష్కీ గౌడ్(Madhu yashki goud) గెస్ట్ హౌస్‌లో పోలీసులు అర్ధరాత్రి సోదాలు నిర్వహించారు. దీంతో అర్ధరాత్రి అక్కడ టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది.
మధుయాష్కీ ఇంట్లో పెద్ద మొత్తంలో డబ్బు ఉందన్న సమాచారంతో పోలీసులు దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే అసలు ఫిర్యాదు ఎవరు ఇచ్చారు? సెర్చ్ వారెంట్ ఉందా? అంటూ మధుయాష్కీ పోలీసులను ప్రశ్నించారు. ఈ సోదాల్లో మధుయాష్కి ఇంట్లో రూ.5.5లక్షల నగదును గుర్తించి సీజ్ చేశారు. లెక్కలు చెప్పాలని మధుయాష్కిని కోరారు.
ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా మధుయాష్కీ ఇంటిపై దాడి చేయడంపై కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఓటమి భయంతోనే బీఆర్ఎస్, బీజేపీలు కలిసి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని మధుయాష్కీ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులపై ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.
విషయం తెలుసుకున్న కాంగ్రెస్ శ్రేణులు సైతం మద్దతుగా మధుయాష్కీ నివాసం వద్దకు చేరుకున్నాయి. ఇది ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి పనే అని వారు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే.. అర్ధరాత్రి మధుయాష్కీ గౌడ్ నివాసం ఇంటిపై పోలీసుల దౌర్జన్యానికి పాల్పడ్డారని తెలంగాణ కాంగ్రెస్ ట్వీట్ చేసింది.
అర్థరాత్రి మధుయాష్కీ గౌడ్ నివాసం ఇంటిపై పోలీసుల దౌర్జన్యం. అనుమతి లేకుండా ఇంట్లోకి చొరపడ్డారు.
సోదాల పేరుతో కుటుంబ సభ్యులను భయబ్రాంతులకు గురిచేసిన పోలీసులు.
ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా మధుయాష్కీ గౌడ్ గారి అర్థరాత్రి ఇంట్లోకి వచ్చి ఇబ్బందులకు గురి చేసిన పోలిసులు.#ByeByeKCR pic.twitter.com/rGPr14TImo
— Telangana Congress (@INCTelangana) November 14, 2023