ప్రపంచమే ఒక వింత.. మరి అలాంటి ప్రపంచంలో ఉండే మనుషులు.. వింతగా ప్రవర్తించడంలో వింత లేదు.. కానీ ఇలాంటి సంఘటనలు చదివినప్పుడు సరాదాగా అనిపిస్తుంది. కానీ సరదాగా కనిపించే ఘటన వెనక బాధ కూడా ఉంటుందని గమనించే వారు తక్కువగా ఉంటారు. ఇప్పుడు చదివే సంఘటన కూడా ఇలాంటిదే..
ఇక ప్రస్తుతం ఎన్నికల హడావుడిలో రాష్ట్రాలు ఉన్నాయి. మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లో కూడా సేమ్ సిచ్యువేషన్.. ఎన్నికల విధుల శిక్షణకు హాజరు కావాలని అక్కడి అధికారులు ప్రభుత్వ ఉద్యోగులకు (Government Employees) ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో సాత్నా జిల్లాలోని అమర్ పతన్ మహుదర్ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా (Govt School) విధులు నిర్వహిస్తున్న అఖిలేష్ కుమార్ కి కూడా ఆదేశాలు అందాయి. కానీ అతను శిక్షణ తరగతులకు గైర్హాజరయ్యారు.
అఖిలేష్ ట్రైనింగ్ కు వెళ్లక పోవడంతో ఉన్నతాధికారులు నోటీసులు పంపించారు.. ఆ నోటీసులు అందుకున్న అఖిలేష్.. అధికారులకు షాకిచ్చారు.. దిమ్మతిరిగే డిమాండ్ వారి ముందు ఉంచాడు.. తనకు 35 యేళ్లు వచ్చినా ఒంటరిగా ఉన్నానని.. తనకు వెంటనే పెళ్లి చేస్తే గానీ విధులకు హాజరు కాలేనని అధికారులకు వివరణ లెటర్ రాశాడు.
అదీగాక తనకు ఒక ప్లాట్ ఇప్పించి.. 35 లక్షల డౌరీ ఇవ్వాలని డిమాండ్ చేశాడు.. ఆ డబ్భులతో దీవుల్లో ఎంజాయ్ చేస్తానని కూడా తెలిపాడు. అఖిలేష్ లెటర్ చూసిన ఉన్నతాధికారులు షాక్ అయ్యారు. మరోవైపు తనకు చేయి విరిగిందని.. వెన్నెముక సంబంధిత వ్యాధులు కూడా ఉన్నాయని అఖిలేష్ లేఖలో పేర్కొనడం విశేషం.. ఇంకేముంది అఖిలేష్ లెటర్ చదివిన అధికారులు.. అతన్ని సస్పెండ్ చేసి.. మచ్ గావ్ బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కు అటాచ్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టు గా మారింది.