కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం ఆరు గ్యారంటీల కోసం అప్లికేషన్లు స్వీకరిస్తున్న విషయం తెలిసిందే.. అయితే ఇక్కడ ఒక పంచాయితీ మొదలైంది. కొందరు కాంగ్రెస్ నాయకులు దురుసుగా ప్రవర్తించారనే విమర్శలు వస్తున్నాయి. ప్రజా పాలనకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్లు పంచాయతీ కార్యదర్శి పంచుతుండగా కాంగ్రెస్ నాయకులు వాటిని ఎత్తుకెళ్లినట్టు సమాచారం..
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం జోగులాంబ గద్వాల (Jogulamba Gadwala) జిల్లా కేటి దొడ్డి మండలం గువ్వలదిన్నె (Guvvaladinne) గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకోంది. పంచాయతీ కార్యదర్శి మీర్జా అలీ బేగ్ ఎంపీడీవో కార్యాలయంలో ప్రజా పాలన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ఆరు పథకాల అప్లికేషన్లు పంచుతుండగా కొందరు కాంగ్రెస్ (Congress) నాయకులు వాటిని ఎత్తుకెళ్లినట్టు ఆరోపణలు వస్తున్నాయి..
ప్రజా పాలన కార్యక్రమం వద్దకు వచ్చిన కొందరు.. ఇది తమ ప్రభుత్వం అని పేర్కొంటూ.. దరఖాస్తు పత్రాలు తామే పంచుతామని అల్లరి చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. గ్రామంలో ప్రజా పాలన కార్యక్రమం గురించి ఎలాంటి చాటింపు లేకుండా అప్లికేషన్లు ఎలా పంచుతున్నారని గొడవకు దిగినట్టు స్థానికులు వెల్లడిస్తున్నారు. ఎవరు ఓటు వేశారో, వేయలేదో తమకే తెలుసని, గ్రామ కార్యదర్శి నుంచి అప్లికేషన్ ఫామ్లు లాక్కెళ్లినట్టు తెలుస్తోంది. ఇంతలో అక్కడికి చేరుకొన్న జిల్లా అదనపు కలెక్టర్ అపూర్వ్ చౌహాన్, ఎస్సై వెంకటేష్ పరిస్థితిని చక్కదిద్దినట్టు వెల్లడించారు..