మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ (89) అస్వస్థతకు గురయ్యారు. జ్వరం, ఛాతిలో ఇన్ఫెక్షన్ తో ఆమె బాధపడుతున్నట్లు సమాచారం.. ఈ క్రమంలో మహారాష్ట్ర (Maharashtra), పుణె (Pune)లోని భారతి ఆస్పత్రిలో చేరారు. అయితే ప్రతిభా పాటిల్ (Pratibha Patil) ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అయితే గతేడాది ప్రతిభా పాటిల్ భర్త దివిసింగ్ షేకావత్ (89) హార్ట్ ఎటాక్ కారణంగా కన్నుమూశారు.

తర్వాత 1985 వరకు ఎడ్లాబాద్ (Muktai Nagar) నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం 1985 నుంచి 1990 వరకు రాజ్యసభలో పార్లమెంటు సభ్యురాలిగా పనిచేశారు. తరువాత 10వ పార్లమెంటు సభ్యురాలుగా ఎన్నికయ్యారు. ఇక మహారాష్ట్ర, అమరావతిలో పేద మహిళల కోసం సంగీతం, కంప్యూటర్, కుట్టు తరగతులను నిర్వహించడంలో ప్రతిభా పాటిల్ కీలక పాత్ర పోషించారు. జల్గావ్ జిల్లాలో మహిళా హోంగార్డును కూడా ఏర్పాటు చేశారు. వారి కమాండెంట్‌గా ఉన్నారు.
తన సుదీర్ఘకాలంలో ప్రభుత్వం మరియు మహారాష్ట్ర శాసనసభలో వివిధ పదవులను నిర్వహించారు. రాజ్యసభలో ఉండగా 1986 నుంచి 1988 వరకు రాజ్యసభ డిప్యూటీ చైర్‌పర్సన్‌గా ఉన్నారు. వెంకటరామన్ భారత రాష్ట్రపతిగా ఎన్నికైనప్పుడు రాజ్యసభ చైర్‌పర్సన్‌గా కూడా పనిచేశారు. 1986 నుంచి 1988 వరకు రాజ్యసభ అధ్యక్షురాలు, ప్రివిలేజెస్ కమిటీ, రాజ్యసభ సభ్యురాలు, బిజినెస్ అడ్వైజరీ కమిటీ, రాజ్యసభ. లోక్‌సభలో ఉన్నప్పుడు హౌస్ కమిటీ చైర్‌పర్సన్‌గా ఉన్నారు. మహిళల అభివృద్ధి కోసం మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే మహిళా వికాస్ మహామండల్ను ఏర్పాటు చేయడంలో పాటిల్ మార్గదర్శక పాత్ర పోషించారు.