Telugu News » Suicide : ఉప సర్పంచ్ భర్త ఆత్మహత్యాయత్నం.. మండిపడుతున్న బీఆర్ఎస్ నాయకులు..!!

Suicide : ఉప సర్పంచ్ భర్త ఆత్మహత్యాయత్నం.. మండిపడుతున్న బీఆర్ఎస్ నాయకులు..!!

వీటికి సంబంధించి బిల్లులను మంజూరు చేయవద్దని ఎమ్మెల్యే అనిరుధ్‌ రెడ్డి, సోదరుడు దుష్యంత్ రెడ్డి.. గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు వెంకటేష్ గౌడ్ తనకు తెలిపినట్టు AE రాములు ఆరోపణలు చేస్తున్నారు.. వీరు చెప్పడం వల్లే బిల్లులు మంజూరు చేయలేదని దామోదర్‌తో AE అన్నట్టు సమాచారం..

by Venu

తప్పుడు పనులు చేసేది ఒకరు.. తప్పించుకునేది మరోకరు.. చివరికి బలి అయ్యేది అమాయకులు.. ఇలాంటి పనులు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎన్ని జరిగినా బయటకు పొక్కకుండా నొక్కిపెట్టారనే ఆరోపణలు ఒకరేంజ్ లో ఉన్నాయి.. అప్పటి ప్రభుత్వ కాలంలో ఎందరో బిల్లులు రాకపోవడం వల్ల ఆత్మహత్యలు చేసుకొన్నట్టు వార్తలు హాల్ చల్ చేశాయని అంటున్నారు. అయితే కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం ఏర్పడి రెండు నెలల సమయంలోనే నిందను మోసేలా దారుణం జరిగిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి..

మహబూబ్ నగర్ (Mahbub Nagar)జిల్లా, నవాబుపేట (Nawabupeta) మండల పరిధిలోని, దేపల్లి (Depalli) ఉప సర్పంచ్ యశోద భర్త దామోదర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గ్రామంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీల నిర్మాణానికి సుమారు రూ.3 లక్షలకు పైగా వెచ్చించి పనులను పూర్తి చేయించినట్టు సమాచారం.. ఈ క్రమంలో జరిగిన పనులకు బిల్లులు మంజూరు చేయాలని పంచాయతీ రాజ్ శాఖ AE రాములును ఫోన్ చేసి వేడుకొన్నట్టు తెలుస్తోంది.

అయితే వీటికి సంబంధించి బిల్లులను మంజూరు చేయవద్దని ఎమ్మెల్యే అనిరుధ్‌ రెడ్డి, సోదరుడు దుష్యంత్ రెడ్డి.. గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు వెంకటేష్ గౌడ్ తనకు తెలిపినట్టు AE రాములు ఆరోపణలు చేస్తున్నారు.. వీరు చెప్పడం వల్లే బిల్లులు మంజూరు చేయలేదని దామోదర్‌తో AE అన్నట్టు సమాచారం.. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన దామోదర్, జడ్చర్ల సమీపంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు వెల్లడిస్తున్నారు..

మరోవైపు క్రిమి సంహారక మందు తాగి దామోదర్ ఆత్మహత్యా ప్రయత్నం చేసినట్టు గుర్తించిన స్థానికులు వెంటనే స్పందించి.. చికిత్స నిమిత్తం జడ్చర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా ఈ ఘటనపై బీఆర్ఎస్ నాయకులు మండిపడుతున్నారు.. దీనికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు..

You may also like

Leave a Comment