Telugu News » Guntur Karam Movie : గుండెల్లో దిగిన గుంటూరు కారం.. మహేష్ బాబు కోసం చెయ్యి కోసుకొన్న అభిమాని..!!

Guntur Karam Movie : గుండెల్లో దిగిన గుంటూరు కారం.. మహేష్ బాబు కోసం చెయ్యి కోసుకొన్న అభిమాని..!!

అక్కడక్కడా నెగెటివ్‌ టాక్‌ వస్తున్నా.. మహేష్ కు ఉన్న క్రేజ్ వల్ల ఈ సినిమా భారీ కలెక్షన్లు కొల్లగొడుతోంది. అయితే ఈ మూవీ రిలీజ్ డేటు ప్రకటించినప్పటి నుంచి మహేష్ బాబు (Mahesh Babu) ఫ్యాన్స్ హంగామా ఒక రేంజ్ లో ఉంది.

by Venu

స్టార్ హీరోలపై జనంలో ఉన్న అభిమానం ఒక్కోసారి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. తమ అభిమాన హీరో మూవీ రిలీజ్ అయితే వారు చేసే హడావుడికి హద్దు ఉండదని ఎన్నో సార్లు రుజువు అయ్యింది కూడా.. అయితే ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ ‘గుంటూరు కారం’ (Guntur Karam ). త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రస్తుతం రికార్డు స్థాయి వసూళ్లతో దూసుకుపోతోంది.

అక్కడక్కడా నెగెటివ్‌ టాక్‌ వస్తున్నా.. మహేష్ కు ఉన్న క్రేజ్ వల్ల ఈ సినిమా భారీ కలెక్షన్లు కొల్లగొడుతోంది. అయితే ఈ మూవీ రిలీజ్ డేటు ప్రకటించినప్పటి నుంచి మహేష్ బాబు (Mahesh Babu) ఫ్యాన్స్ హంగామా ఒక రేంజ్ లో ఉంది. కొందరైతే పోస్టర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి అభిమానం చాటుకొన్నారు. ఇక పాలాభిషేకాలు.. కొబ్బరి కాయలు కొట్టడం కామనే.. హీరోలపై ఉన్న అభిమానం, పిచ్చి ఎంతవరకైనా తీసుకెళ్తుంది.

ఈ క్రమంలో మహేష్ బాబు కోసం ఓ వీరాభిమాని చేసిన పని సోషల్ మీడియా (Social media)లో రచ్చ రచ్చగా మారింది. బ్లేడుతో చేయి కోసుకుని మరీ సూపర్ స్టార్ ఫ్లెక్సీకి రక్త తిలకం దిద్దాడు. కొంతమంది వ్యక్తులు ఈ దృశ్యాన్ని వీడియో తీసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 4 సార్లు కోసుకుని మరీ ఫ్లెక్సీకి రక్త తిలకం దిద్దడంపై నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.. ఇదేం పిచ్చిరా బాబు.. అభిమానం ఉండాలి కానీ ఇంతలా ఉండకూడదంటూ విమర్శిస్తున్నారు..

You may also like

Leave a Comment