Telugu News » Mahua Moitra: ‘టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాను లోక్‌సభ నుంచి బహిష్కరించాలి’

Mahua Moitra: ‘టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాను లోక్‌సభ నుంచి బహిష్కరించాలి’

లోక్‌సభ నుంచి బహిష్కరించాలని, ఆమె సభ్యత్వాన్ని రద్దు చేయాలని పార్లమెంట్‌ ఎథిక్స్‌ కమిటీ (Ethics Committee) సిఫారసు చేసింది. ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ 500 పేజీలతో కూడి తుది నివేదికను రూపొందించింది.

by Mano
Mahua Moitra: 'Congress MP Mahua Moitra should be expelled from Lok Sabha'

పార్లమెంటులో ప్రశ్నలు సంధించేందుకు లంచం తీసుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మహువా మొయిత్రా(Mahua Moitra)కు లోక్‌సభ నైతిక విలువల కమిటీ షాక్ ఇచ్చింది. లోక్‌సభ నుంచి బహిష్కరించాలని, ఆమె సభ్యత్వాన్ని రద్దు చేయాలని పార్లమెంట్‌ ఎథిక్స్‌ కమిటీ (Ethics Committee) సిఫారసు చేసింది. ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ 500 పేజీలతో కూడి తుది నివేదికను రూపొందించింది.

Mahua Moitra: 'Congress MP Mahua Moitra should be expelled from Lok Sabha'

ఆ నివేదికలో మహువా మొయిత్రా చర్యలు అత్యంత అభ్యంతరకరం, అనైతికం, నేరపూరితం, హేయమైనవి, నేరపూరితమైనవని అని పేర్కొంది. అదేవిధంగా మొయిత్రా అనైతిక వ్యవహారంపై భారత ప్రభుత్వం న్యాయ, సంస్థాగత, కాలపరిమితితో కూడిన దర్యాప్తు చేపట్టాలని అందులో పేర్కొంది.

లోక్‌సభలో ప్రశ్నలు అడిగేందుకు పారిశ్రామికవేత్త హీరానందాని నుంచి మొయిత్రా డబ్బులు తీసుకున్నారన్న బీజేపీ ఎంపీ నిషికాంత్‌ దూబే చేసిన ఆరోపణలపై 15 మంది సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆమె ఈ నెల 2న కమిటీ ముందు హాజరయ్యారు.

నగదు, బహుమతులకు బదులుగా పార్లమెంటులో ప్రశ్నలు అడగడానికి మహువా మోయిత్రా, వ్యాపారవేత్త దర్శన్ హిరానందాని మధ్య లంచం మార్పిడి జరిగిందని బీజేపీ ఎంపీ దూబే ఆరోపించారు. వారిద్దరి మధ్య జరిగిన లావాదేవీలకు సంబంధించి న్యాయవాది జై అనంత్ దేహద్రాయ్ రాసిన లేఖను ఆయన ఉదహరించారు. అయితే వీటన్నింటినీ మహువా ఖండించారు. ఎంపీ నిషికాంత్ దూబే, జై అనంత్‌కు ఆమె ఇప్పటికే లీగల్ నోటీసులు పంపించారు.

You may also like

Leave a Comment