Telugu News » Mallikarjun Kharge : మోడీ, కేసీఆర్,ఓవైసీ ముగ్గురు తోడు దొంగలు…..!

Mallikarjun Kharge : మోడీ, కేసీఆర్,ఓవైసీ ముగ్గురు తోడు దొంగలు…..!

ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ముగ్గురు తోడు దొంగలేనని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నెరవేర్చుతామని ఆయన తెలిపారు.

by Ramu

నిరుపేదలను ఆదుకోవడంలో బీజేపీ (BJP), బీఆర్ఎస్ (BRS) నిర్లక్షం చేస్తున్నాయని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) అన్నారు. ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ముగ్గురు తోడు దొంగలేనని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నెరవేర్చుతామని ఆయన తెలిపారు.

ఆలంపూర్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మల్లికార్జున ఖర్గే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఆలంపూర్ చాలా పవిత్రమైన ప్రాంతమని తెలిపారు. కృష్ణ, తుంగభద్రల సంగమ ప్రాంతమన్నారు. తెలంగాణ ప్రజలు ఇచ్చే విజయకానుక భారతదేశం మొత్తం ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు.

దేశంలో మూడు పత్రికలకు చెందిన సుమారు 780 కోట్ల ఆస్తులను బీజేపీ సర్కార్ జప్తు చేసిందని తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. ఆ మూడు పత్రికలు నెహ్రూ సొంత ఆస్తి అన్నారు. నెహ్రూ స్థాపించిన ఈ మూడు పత్రికలు స్వతంత్ర పోరాటంలో ముఖ్యమైన భూమికను పోషించాయన్నారు. కేసీఆర్,కొడుకు, కూతురు, అల్లుడు తెలంగాణను దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇందిరాగాంధీని కేసీఆర్ విమర్శిస్తున్నాడన్నారు. ఇందిరాగాంధి ఎక్కడ అని ప్రశ్నిస్తున్నారన్నారు. మరి కేసీఆర్ ఎక్కడ అని ఆయన ప్రశ్నించారు. ఫామ్ హౌస్‌లో కూర్చొని పరిపాలిస్తున్నావంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 2017లో ఇచ్చిన హామీలన్నీ ఏమయ్యాయని నిలదీశారు. ఏ ఒక్కటి పూర్తి చేయలేదని తీవ్రంగా విరుచుకు పడ్డారు. అప్పట్లో ఎంపీగా ఉన్న విజయశాంతి తెలంగాణ కోసం పార్లమెంట్‌లో సభ జరిగిన సమయంలో తెలంగాణ కోసం స్పీకర్ పోడియంలోకి వెళ్లి 4, 5 గంటలు పోరాడిందన్నారు. అప్పుడు కేసీఆర్ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు.

You may also like

Leave a Comment