Telugu News » Mallu Bhatti Vikramarka: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఇంట తీవ్ర విషాదం..!

Mallu Bhatti Vikramarka: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఇంట తీవ్ర విషాదం..!

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క (Mallu Bhatti Vikramarka) ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన సోదరుడు మల్లు వెంకటేశ్వరరావు(70) కన్నుమూశారు.

by Mano
Mallu Bhatti Vikramarka: Deep tragedy at the house of Deputy CM Mallu Bhatti Vikramarka..!

తెలంగాణ డిప్యూటీ సీఎం(Deputy CM of Telangana) మల్లు భట్టివిక్రమార్క (Mallu Bhatti Vikramarka) ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన సోదరుడు మల్లు వెంకటేశ్వరరావు(70) కన్నుమూశారు. ఆయన ఆయుర్వేద వైద్యుడిగా పనిచేశారు.

Mallu Bhatti Vikramarka: Deep tragedy at the house of Deputy CM Mallu Bhatti Vikramarka..!

కొంతకాలంగా వెంకటేశ్వర్లు అనారోగ్యంతో బాధపడుతున్నారు. కుటుంబసభ్యులు ఆయనకు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన పరిస్థితి విషమించడంతో మంగళవారం ఉదయం మృతిచెందారు.

దీంతో ఆయన భౌతికకాయాన్ని వైరాకు తరలిస్తున్నారు. ఇవాళ సాయంత్రం ఆయన స్వగ్రామమైన స్నానాల లక్ష్మీపురంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈనేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మేడిగడ్డ పర్యటనను రద్దు చేసుకున్నారు. ఆయన నేరుగా వైరాకు బయల్దేరారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతోపాటు ఎంఐఎం, సీపీఐ శాసన సభ్యులుకూడా వెళ్లనున్నారు. మేడిగడ్డ సందర్శన కోసం ప్రభుత్వం ఆర్టీసీకి చెందిన నాలుగు బస్సులను సిద్ధంచేసింది.

You may also like

Leave a Comment